Telugu Global
NEWS

జగన్‌కి మరో షాక్‌

త్వరలో ఏపీఎస్ ఆర్టీసీ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో చక్రం తిప్పాలనుకుంటున్న వైసీపీ పాచికలు ఫలించడం లేదు. మద్దతిస్తామన్న తీసుకునేందుకు కార్మిక సంఘాలు ముందుకు రావడం లేదు. ఏడాది క్రితం వైఎస్‌ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియర్ ఏర్పడింది. అయితే అనుకున్నంత స్థాయిలో ఇది ప్రభావం చూపలేకపోతోంది. అయితే గుర్తింపు సంఘం ఎన్నికల సమీపిస్తున్న వేళ వైసీపీ కార్మిక సంఘానికి గౌరవాధ్యక్షుడిగా ఉన్న జగన్ మేనమామ రంగంలోకి దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ చర్చలు […]

జగన్‌కి మరో షాక్‌
X

త్వరలో ఏపీఎస్ ఆర్టీసీ కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో చక్రం తిప్పాలనుకుంటున్న వైసీపీ పాచికలు ఫలించడం లేదు. మద్దతిస్తామన్న తీసుకునేందుకు కార్మిక సంఘాలు ముందుకు రావడం లేదు. ఏడాది క్రితం వైఎస్‌ఆర్ ఆర్టీసీ మజ్దూర్ యూనియర్ ఏర్పడింది. అయితే అనుకున్నంత స్థాయిలో ఇది ప్రభావం చూపలేకపోతోంది. అయితే గుర్తింపు సంఘం ఎన్నికల సమీపిస్తున్న వేళ వైసీపీ కార్మిక సంఘానికి గౌరవాధ్యక్షుడిగా ఉన్న జగన్ మేనమామ రంగంలోకి దిగారు.

రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ చర్చలు జరుపుతున్నారు. అయితే సొంతంగా ఎన్నికలకు వెళ్తే తేడా వస్తుందని నేతలు రవీంద్రనాథ్ రెడ్డికి సూచించారు. ఇదే సమయంలో ఆర్టీసీలో ప్రధాన యూనియన్లుగా ఉన్న ఎన్‌ఎంయూ, కార్మిక పరిషత్‌లు రెండు పొత్తు పెట్టుకుంటాయని భావించారు. కానీ వాటి మధ్య పొత్తు బెడిసికొట్టింది. దీన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని వైసీపీ నేతలు భావించారు. ఈయూకు మద్దతు ఇస్తామంటూ రవీంద్రనాథ్ రెడ్డి ముందుకొచ్చారు.

రెండు రోజుల క్రితం ఎంప్లాయిస్ యూనియన్ ముఖ్య నేతలతో విజయవాడలో రవీంద్రనాథ్ రెడ్డి చర్చలు జరిపారు. తమకు ప్రతి డిపోలోనూ ఓటు బ్యాంకు ఉందని, తమ పార్టీ ఎమ్మెల్యేలు కూడా యూనియన్ గెలుపు కోసం పనిచేస్తారని చెప్పారు. కలిసి పోటీ చేద్దామని ప్రతిపాదించారు. అయితే ఎన్‌ఎంయూ నేతలు.. రవీంద్రనాథ్ రెడ్డి ప్రతిపాదనను తోసిపుచ్చారు. ఈ ఎన్నికల్లో జగన్‌ జోక్యం చేసుకోవద్దని సూచించారు. తమకు రాష్ట్రంలోనే బలమైన సంఘమని … మరో కార్మిక సంఘం మద్దతు తమకు అవసరం లేదని ఈయూ నేతలు మీడియాతో చెప్పారు. ఇప్పటికే ఎంప్లాయిస్ మజ్దూర్‌ యూనియన్ నుంచి చాలా మంది తమ యూనియన్‌లో చేరారని ఈయూ నేతలు చెబుతున్నారు.

పైగా ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖర్ రెడ్డి జగన్‌కు అత్యంత సన్నిహితుడు కూడా. ఈ నేపథ్యంలో తమకు తెలియకుండా రవీంద్రనాథ్ రెడ్డి తమ సంఘం నేతలతో చర్చలు జరపడంపై చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహంగా ఉన్నారు. ఈ విషయంలో జగన్‌తో మాట్లాడి నిరసన కూడా తెలిపారట. అయితే వైసీపీ కార్మిక సంఘం మద్దతు తీసుకుంటే చివరకు ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీల జోక్యం ఎక్కువవుతుందన్న భావన కూడా వ్యక్తమవుతోంది.

CLICK ON IMAGE TO READ:

ktr

First Published:  6 Feb 2016 9:00 PM GMT
Next Story