Telugu Global
Cinema & Entertainment

హృతిక్ కు కొత్త త‌ల‌నొప్పి! 

బాలీవుడ్ కండ‌ల వీరుడు  హృతిక్ రోష‌న్ కు  సినిమాకో త‌ల‌నొప్పి  ఎటాక్ అవుతుంది.  ప్ర‌స్తుతం   మొహంజ‌దారో చిత్రం తో  బిజీగా వున్న  హృతిక్ ..   త‌న వైఫు సుజాన తో  డైవోర్స్  అయిన త‌రువాత‌..  డేటింగ్ ల గోల ఎక్కువ‌య్యింది. మొన్న‌టి వ‌ర‌కు బార్జారా మోరీ తో  డేటింగ్ చేశాడంటూ  గోల చేసిన  మీడియా…తాజాగా బాలీవుడ్ బోల్డ్ లేడి కంగ‌న ర‌నావౌత్ తో ఏదో  ఎఫైర్ న‌డుస్తుంది అంటూ మొద‌లెట్టారు. ఆషిక్  3 చిత్రంలో […]

హృతిక్ కు కొత్త త‌ల‌నొప్పి! 
X
బాలీవుడ్ కండ‌ల వీరుడు హృతిక్ రోష‌న్ కు సినిమాకో త‌ల‌నొప్పి ఎటాక్ అవుతుంది. ప్ర‌స్తుతం మొహంజ‌దారో చిత్రం తో బిజీగా వున్న హృతిక్ .. త‌న వైఫు సుజాన తో డైవోర్స్ అయిన త‌రువాత‌.. డేటింగ్ ల గోల ఎక్కువ‌య్యింది. మొన్న‌టి వ‌ర‌కు బార్జారా మోరీ తో డేటింగ్ చేశాడంటూ గోల చేసిన మీడియా…తాజాగా బాలీవుడ్ బోల్డ్ లేడి కంగ‌న ర‌నావౌత్ తో ఏదో ఎఫైర్ న‌డుస్తుంది అంటూ మొద‌లెట్టారు.
ఆషిక్ 3 చిత్రంలో త‌న‌ను హృతికే త‌ప్పించాడంటూ ఈ మ‌ధ్య కంగ‌న వ్యాఖ్యానం చేసిన విష‌యం తెలిసిందే. కంగ‌న హృతిక్ తో డేటింగ్ చేస్తుంది కాబ‌ట్టే .. హృతిక్ త‌న‌ను త‌ప్పించ‌లేదంటూ ఓపెన్ గా మీడియాకు స‌మాధానం ఇచ్చిందంటున్నారు బాలీవుడ్ జ‌నాలు.
ఈమ‌ధ్య ధీరే ధీరే సే ఆల్బ‌మ్ రిలీజ్ సంద‌ర్భంగా హృతిక్ ను మీడియా మిత్రులు..కంగ‌న విష‌యం అడిగితే.. దీనికి నేను ఏమి చెప్పాలో అర్ధం కావ‌డం లేదంటూ ఆన్స‌ర్ ఇచ్చారు. అంటే కంగ‌న తో డేటింగ్ ఉన్న‌ట్లే గా అంటున్నారు గాసిప్ రాయుళ్లు.
First Published:  8 Feb 2016 12:49 AM GMT
Next Story