Telugu Global
Cinema & Entertainment

ఆ డైరక్టర్ కు హ్యాండిచ్చిన ఎన్టీఆర్

దర్శకుల విషయంలో ఎప్పుడూ ఫ్రెండ్లీగా ఉంటాడు ఎన్టీఆర్. ఎవరు, ఎప్పుడు, కథ తీసుకొని తన దగ్గరకి వచ్చినా ఓపిగ్గా వింటాడు. వాళ్లు అడిగినంత సమయం కేటాయిస్తాడు. ఇప్పటికే పలువురు దర్శకులకు అలా అవకాశాలిచ్చాడు తారక్. కానీ దర్శకుల్ని ఎంతగా ఆదరిస్తాడో… తనకు కథ నచ్చకపోతే అదేస్థాయిలో సినిమాను తిప్పికొడతాడు కూడా. గతంలో కొరటాల శివను ఇలానే ఓసారి కాదన్నాడు. మరో దర్శకుడు మెహర్ రమేష్ కు కూడా నో చెప్పాడు. తాజాగా ఈ లిస్టులోకి హరీశ్ శంకర్ […]

ఆ డైరక్టర్ కు హ్యాండిచ్చిన ఎన్టీఆర్
X
దర్శకుల విషయంలో ఎప్పుడూ ఫ్రెండ్లీగా ఉంటాడు ఎన్టీఆర్. ఎవరు, ఎప్పుడు, కథ తీసుకొని తన దగ్గరకి వచ్చినా ఓపిగ్గా వింటాడు. వాళ్లు అడిగినంత సమయం కేటాయిస్తాడు. ఇప్పటికే పలువురు దర్శకులకు అలా అవకాశాలిచ్చాడు తారక్. కానీ దర్శకుల్ని ఎంతగా ఆదరిస్తాడో… తనకు కథ నచ్చకపోతే అదేస్థాయిలో సినిమాను తిప్పికొడతాడు కూడా. గతంలో కొరటాల శివను ఇలానే ఓసారి కాదన్నాడు. మరో దర్శకుడు మెహర్ రమేష్ కు కూడా నో చెప్పాడు. తాజాగా ఈ లిస్టులోకి హరీశ్ శంకర్ కూడా చేరిపోయాడు. ఈమధ్యే ఎన్టీఆర్ కు ఓ కథ వినిపించాడట హరీశ్. అయితే హరీష్ చెప్పిన స్టోరీ అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించలేదు ఎన్టీఆర్ కి. వెంటనే నో చెప్పేశాడు. ఇంతకంటే మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీలైన్ తో రమ్మని పంపించేశాడు. సేమ్ టైం… పూరి జగన్నాధ్ దర్శకత్వంలో మరోసారి నటించడానికి సిద్ధమౌతున్నాడు. టెంపర్ తో తనకు హిట్ ఇచ్చిన పూరికి మరోసారి ఛాన్స్ ఇచ్చాడు. త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న జనతా గ్యారేజీ కంప్లీట్ అయిపోయిన వెంటనే… పూరి తో సినిమా స్టార్టవుతుంది.
First Published:  8 Feb 2016 4:41 AM GMT
Next Story