Telugu Global
National

అత‌ను క‌డుపుతో ఉన్నాడ‌ట‌!

కేర‌ళ‌లోని కోజికోడ్‌లో ఈ విచిత్రం జ‌రిగింది. అంటే మ‌గ‌వాడు గ‌ర్భం దాల్చ‌డం కాదు…తాను క‌డుపుతో ఉన్న‌ట్టుగా ఓ పురుషుడు  చాలా బ‌లంగా న‌మ్మ‌డం. 52ఏళ్ల ఆ వ్య‌క్తి తాను క‌డుపుతో ఉన్నాన‌ని, పొట్ట‌లో బిడ్డ క‌ద‌లిక‌లు బాగా తెలుస్తున్నాయ‌ని గ‌ట్టిగా న‌మ్ముతూ వింత‌గా ప్ర‌వ‌ర్తించ‌డం మొద‌లుపెట్టాడు.  పోస్ట్ గ్రాడ్యుయేష‌న్ చేసిన అత‌నికి వివాహ‌మైంది, ఇద్ద‌రు పిల్ల‌లుకూడా ఉన్నారు. మ‌గ‌వాళ్లు గ‌ర్భం దాల్చ‌లేరు అనే విష‌యాన్ని న‌మ్మ‌డానికి అత‌నేమాత్రం సిద్ధ‌ప‌డ‌క‌పోగా, నిరుద్యోగి అయిన అత‌ను, తాను ప‌నులు చేయకూడ‌దంటూ […]

అత‌ను క‌డుపుతో ఉన్నాడ‌ట‌!
X

కేర‌ళ‌లోని కోజికోడ్‌లో ఈ విచిత్రం జ‌రిగింది. అంటే మ‌గ‌వాడు గ‌ర్భం దాల్చ‌డం కాదు…తాను క‌డుపుతో ఉన్న‌ట్టుగా ఓ పురుషుడు చాలా బ‌లంగా న‌మ్మ‌డం. 52ఏళ్ల ఆ వ్య‌క్తి తాను క‌డుపుతో ఉన్నాన‌ని, పొట్ట‌లో బిడ్డ క‌ద‌లిక‌లు బాగా తెలుస్తున్నాయ‌ని గ‌ట్టిగా న‌మ్ముతూ వింత‌గా ప్ర‌వ‌ర్తించ‌డం మొద‌లుపెట్టాడు. పోస్ట్ గ్రాడ్యుయేష‌న్ చేసిన అత‌నికి వివాహ‌మైంది, ఇద్ద‌రు పిల్ల‌లుకూడా ఉన్నారు. మ‌గ‌వాళ్లు గ‌ర్భం దాల్చ‌లేరు అనే విష‌యాన్ని న‌మ్మ‌డానికి అత‌నేమాత్రం సిద్ధ‌ప‌డ‌క‌పోగా, నిరుద్యోగి అయిన అత‌ను, తాను ప‌నులు చేయకూడ‌దంటూ త‌న‌కు బెడ్ రెస్ట్ కావాలంటూ ప‌డుకుని ఉండేవాడు.

త‌న‌కు వాంతులు అవుతున్నాయ‌ని, ఆహారం కూడా తీసుకోలేక పోతున్నాన‌ని అన‌డంతో భ‌య‌ప‌డిన అత‌ని సోద‌రుడు మాన‌సిక వైద్యుని వ‌ద్ద‌కు తీసుకువెళ్లాడు. డాక్ట‌ర్ల బృందం అత‌నికి అన్ని ర‌కాల ప‌రీక్ష‌లు చేసి అన్ని విధాలా నార్మ‌ల్‌గా ఉన్నాడ‌ని, అయితే ఒకర‌క‌మైన భ్రాంతి అత‌నిలో ఆ న‌మ్మ‌కాన్ని బ‌ల‌ప‌ర‌చింద‌ని చెప్పారు. యువ‌కుడిగా ఉన్న రోజుల్లో అత‌నికి స్వలింగ సంప‌ర్కం అల‌వాటు ఉన్న‌ద‌ని, ఆ కార‌ణంగానే అత‌నిలో అలాంటి భ్రాంతులు మొద‌ల‌య్యాయ‌ని డాక్ట‌ర్లు తేల్చారు. మందులు, కౌన్సెలింగ్‌తో అత‌నిలో మార్పు తెస్తున్నారు. క్ర‌మంగా అత‌ను మామూలు మ‌నిషి అవుతాడ‌ని, క్ర‌మం త‌ప్ప‌కుండా అత‌నికి ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని వారు చెప్పారు.

First Published:  7 Feb 2016 1:01 PM GMT
Next Story