Telugu Global
Cinema & Entertainment

విడుదలకు ముందే రూ.80కోట్లు వచ్చాయి

పవన్ నటిస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా విడుదలకు ముందే 80కోట్ల రూపాయలు సంపాందించిందని టాక్. ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ ఇప్పటివరకు 80 నుంచి 90కోట్ల రూపాయల మధ్య జరిగిందని తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను అమ్మలేదు. ఆ మొత్తాన్ని కూడా కలుపుకుంటే…. ప్రీ-రిలీజ్ బిజినెస్ వందకోట్ల రూపాయలు దాటిపోనుందని తెలుస్తోంది. సో… పవన్ సినిమా విడుదలకు ముందే వంద కోట్ల రూపాయలు ఆర్జించినట్టు లెక్క. విడుదలైన తర్వాత నిజంగా సినిమాకు […]

విడుదలకు ముందే రూ.80కోట్లు వచ్చాయి
X
పవన్ నటిస్తున్న సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా విడుదలకు ముందే 80కోట్ల రూపాయలు సంపాందించిందని టాక్. ఈ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ ఇప్పటివరకు 80 నుంచి 90కోట్ల రూపాయల మధ్య జరిగిందని తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ను అమ్మలేదు. ఆ మొత్తాన్ని కూడా కలుపుకుంటే…. ప్రీ-రిలీజ్ బిజినెస్ వందకోట్ల రూపాయలు దాటిపోనుందని తెలుస్తోంది. సో… పవన్ సినిమా విడుదలకు ముందే వంద కోట్ల రూపాయలు ఆర్జించినట్టు లెక్క. విడుదలైన తర్వాత నిజంగా సినిమాకు హిట్ టాక్ వస్తే…. సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం.
తాజాగా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు సంబంధించి కేరళ షెడ్యూల్ పూర్తిచేశారు. పవన్-కాజల్ మధ్య అక్కడ ఓ పాటను చిత్రీకరించారు. కాపు వివాదం కారణంగా పవన్ ఒక రోజు ముందే హైదరాబాద్ చేరుకోగా… కాస్త ఆలస్యంగా సినిమా యూనిట్ హైదరాబాద్ వచ్చింది. ఈరోజు నుంచి మరో షెడ్యూల్ ప్రారంభం అవుతుంది. తాజా షెడ్యూల్ లో కూడా పవన్-కాజల్ మధ్య సన్నివేశాలు చిత్రీకరిస్తారు. సినిమాను ఏప్రిల్ 8న గ్రాండ్ గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
First Published:  8 Feb 2016 4:03 AM GMT
Next Story