Telugu Global
Cinema & Entertainment

బాహుబ‌లి సిరీస్ నుంచి  క‌ట్ట‌ప్ప ఔటా ?

ద‌ర్శ‌క జ‌క్క‌న రాజ‌మౌళి చెక్కుతున్న చిత్ర రాజ‌సం బాహుబ‌లి. మొద‌టి పార్ట్ ఘ‌న విజ‌యం సాధించిడంతో.. సెకండ్ పార్ట్  మీద  అంత‌కంటే ఎక్కువ అంచ‌నాలు బిల్డ్ అయ్యాయి. క‌ట్ చేస్తే   సెకండ్ పార్ట్ షూటింగ్  ..మొదటి పార్ట్ షూట్ చేస్తున్న స‌మ‌యంలోనే  30 శాతం పూర్తి చేసిన‌ట్లు చెప్పారు.  డిసెంబ‌ర్ లో    షూట్ ప్రారంభించి  మ‌రో 10 శాతం కంప్లీట్ చేశార‌ట‌.  నేష‌న‌ల్ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వూలో ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు తెలిపారు.  బాహుబ‌లి ది క‌న్ […]

బాహుబ‌లి సిరీస్ నుంచి  క‌ట్ట‌ప్ప ఔటా ?
X

ద‌ర్శ‌క జ‌క్క‌న రాజ‌మౌళి చెక్కుతున్న చిత్ర రాజ‌సం బాహుబ‌లి. మొద‌టి పార్ట్ ఘ‌న విజ‌యం సాధించిడంతో.. సెకండ్ పార్ట్ మీద అంత‌కంటే ఎక్కువ అంచ‌నాలు బిల్డ్ అయ్యాయి. క‌ట్ చేస్తే సెకండ్ పార్ట్ షూటింగ్ ..మొదటి పార్ట్ షూట్ చేస్తున్న స‌మ‌యంలోనే 30 శాతం పూర్తి చేసిన‌ట్లు చెప్పారు. డిసెంబ‌ర్ లో షూట్ ప్రారంభించి మ‌రో 10 శాతం కంప్లీట్ చేశార‌ట‌. నేష‌న‌ల్ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వూలో ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు తెలిపారు. బాహుబ‌లి ది క‌న్ క్లూజ‌న్ లో క‌ట్ట‌ప్ప బాహుబ‌లిని ఎందుకు పొడిచాడు అనే దానితో పాటు..దేవ‌సేన కు సంబంధించి ప్లాష్ బ్యాక్ వుంటుంద‌ట‌. సెకండ్ పార్ట్ లో క‌ట్ట‌ప్ప‌క్యారెక్ట‌ర్ ముగుస్తుంద‌ట‌. అలాగే బాహుబ‌లి రో్ల్ కూడా సెకండ్ పార్ట్ లో కంప్లీట్ అవుతుంద‌ట‌.
బాహుబ‌లి పార్ట్ 3 లో అమ‌రేంద్ర బాహుబ‌లి తో క‌థ ప్రార‌భం కావోచ్చ‌ట‌. అంటే పార్ట్ 3 లో మ‌రికొన్ని కొత్త క్యారెక్ట‌ర్స్ పుట్ట‌డం ఖాయంగా క‌నిపిస్తుంది. అలాగే హాలీవుడ్ న‌టీ న‌టులు కూడా పార్ట్ 3 తో వ‌ర్క్ చేసే అవ‌కాశం ఉంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. మొత్తం మీద బాహుబ‌లి సినిమా కు సీక్వెల్ ప‌రంపంర ఇప్ప‌ట్లో ఆగ‌క పోవ‌చ్చు అంటున్నారు రాజ‌మౌళి స‌న్నిహితులు. ఇది నిజంగా బాహుబ‌లి ఫ్యాన్స్ కు గొప్ప శుభ‌వార్తే మ‌రి.

First Published:  8 Feb 2016 4:54 AM GMT
Next Story