Telugu Global
NEWS

ప్రాణాలు పోయాల్సిన డాక్ట‌ర్లు… ప్రాణాల‌తో ఆడుకున్నారు!

ఈ ప్ర‌పంచంలో ఎక్కువ గౌర‌వం ఉన్న వృత్తుల్లో వైద్య వృత్తి ముందు వ‌రుస‌లో ఉంటుంది. అందుకే ఈ రంగంలో ఉన్న‌వారు అనుచితంగా, అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తే ఎవ‌రూ త‌ట్టుకోలేరు. అది మ‌రింత పెద్ద వార్త అవుతుంది. హైద‌రాబాద్‌లో జ‌రిగిన ముగ్గురు డాక్ట‌ర్ల ఉదంతం అలాగే సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఇందులో ఒక‌ డాక్ట‌రు హ‌త్యా ప్ర‌య‌త్నానికి గుర‌యితే, మ‌రొక‌రు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు, ఇంకొక‌రిపై ప్ర‌స్తుతం హ‌త్యారోప‌ణ‌లు ఉన్నాయి. లోరెల్ హాస్ప‌ట‌ల్‌ని క‌లిసి ప్రారంభించిన వైద్యులు శిశి కుమార్‌, సాయి కుమార్‌, […]

ప్రాణాలు పోయాల్సిన డాక్ట‌ర్లు… ప్రాణాల‌తో ఆడుకున్నారు!
X

ఈ ప్ర‌పంచంలో ఎక్కువ గౌర‌వం ఉన్న వృత్తుల్లో వైద్య వృత్తి ముందు వ‌రుస‌లో ఉంటుంది. అందుకే ఈ రంగంలో ఉన్న‌వారు అనుచితంగా, అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తిస్తే ఎవ‌రూ త‌ట్టుకోలేరు. అది మ‌రింత పెద్ద వార్త అవుతుంది. హైద‌రాబాద్‌లో జ‌రిగిన ముగ్గురు డాక్ట‌ర్ల ఉదంతం అలాగే సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఇందులో ఒక‌ డాక్ట‌రు హ‌త్యా ప్ర‌య‌త్నానికి గుర‌యితే, మ‌రొక‌రు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు, ఇంకొక‌రిపై ప్ర‌స్తుతం హ‌త్యారోప‌ణ‌లు ఉన్నాయి. లోరెల్ హాస్ప‌ట‌ల్‌ని క‌లిసి ప్రారంభించిన వైద్యులు శిశి కుమార్‌, సాయి కుమార్‌, ఉద‌య్‌లకు వ్యాపార లావాదేవీల్లో గొడ‌వ‌లు వ‌చ్చాయి. సామ‌ర‌స్య పూరితంగా ప‌రిష్క‌రించుకోవాల‌ని ఒక చోట చేరారు కూడా. కానీ వారి చ‌ర్చ‌లు ఫ‌లించ‌లేదు.

కారులోనే ఉద‌య్‌మీద కాల్పులు జ‌రిగాయి. ఇప్ప‌టివ‌ర‌కు శ‌శికుమారే కాల్పులు జరిపి పారిపోయిన‌ట్టుగా పోలీసులు భావిస్తుండ‌గా, తాను నిర్దోషిన‌ని సాయికుమారే ఉద‌య్‌మీద కాల్పులు జ‌రిపాడ‌ని శ‌శికుమార్ సూసైడ్ నోట్ రాసి, త‌న ఫాం హౌస్‌లోఆత్మ‌హత్య‌కు పాల్ప‌డ్డాడు. ఈ మ‌ధ్య‌లో శ‌శికుమార్‌ని ఫాంహౌస్‌లో దింపి వెళ్లిపోయిన వ్య‌క్తిగా ఆయ‌న స్నేహితురాలు చంద్ర‌క‌ళ పేరు తెర‌మీద‌కు వ‌చ్చింది. గాయ‌ప‌డి చికిత్స పొందుతున్న ఉద‌య్ నోరువిప్పితే కానీ కాల్పులు ఎవ‌రు జ‌రిపారో తెలియ‌దు.

అలాగే ఆత్మ‌హ‌త్య చేసుకోవాల‌న్న త‌లంపుతో ఉన్న స‌మ‌యంలో శ‌శికుమార్‌తో ఉన్న చంద్ర‌క‌ళ‌కూడా ఈ కేసులో కీల‌కంగా మార‌నున్నారు. ఏదిఏమైనా వ్యాపారం, డ‌బ్బు…ఈ విష‌యాలు ఒక వైద్యుని నిండు ప్రాణాలు తీయ‌డం అత్యంత బాధాక‌ర‌మైన విషయం.

First Published:  9 Feb 2016 1:59 AM GMT
Next Story