Telugu Global
International

మ‌నం పంపాము...వాళ్లు తిప్పి పంపారు!

మ‌న కేంద్ర ప్ర‌భుత్వం మేకిన్ ఇండియా ఉద్య‌మాన్ని ముందుకు తీసుకువెళ్లాల‌ని అనుకుంటే, అమెరికా దానికి మోకాల‌డ్డుతున్న‌ట్టుగా ఉంది. గ‌త ఏడాది భార‌త్‌లో త‌యార‌యిన 13,334 ర‌కాల ఉత్ప‌త్తుల‌ను అమెరికా నిరాక‌రించింది. 2010-15 మ‌ధ్య‌కాలంలో అమెరికా ఫుడ్ అండ్ డ్ర‌గ్ అడ్మినిస్ట్రేష‌న్ ఇంత భారీ ఎత్తున భార‌త ఉత్ప‌త్తుల‌ను రిజ‌క్ట్ చేసింది. ఇదే కాలంలో 15,087 చైనా ఉత్ప‌త్తుల‌కు సైతం నో చెప్పింది. నిరాక‌ర‌ణ‌కు గుర‌యిన మ‌న ఉత్ప‌త్తుల్లో పేటెంట్ మందులు, జెనరిక్ మెడిసిన్స్‌, స్నాక్స్‌, బేక‌రీ ఫుడ్స్‌, […]

మ‌నం పంపాము...వాళ్లు తిప్పి పంపారు!
X

మ‌న కేంద్ర ప్ర‌భుత్వం మేకిన్ ఇండియా ఉద్య‌మాన్ని ముందుకు తీసుకువెళ్లాల‌ని అనుకుంటే, అమెరికా దానికి మోకాల‌డ్డుతున్న‌ట్టుగా ఉంది. గ‌త ఏడాది భార‌త్‌లో త‌యార‌యిన 13,334 ర‌కాల ఉత్ప‌త్తుల‌ను అమెరికా నిరాక‌రించింది. 2010-15 మ‌ధ్య‌కాలంలో అమెరికా ఫుడ్ అండ్ డ్ర‌గ్ అడ్మినిస్ట్రేష‌న్ ఇంత భారీ ఎత్తున భార‌త ఉత్ప‌త్తుల‌ను రిజ‌క్ట్ చేసింది. ఇదే కాలంలో 15,087 చైనా ఉత్ప‌త్తుల‌కు సైతం నో చెప్పింది. నిరాక‌ర‌ణ‌కు గుర‌యిన మ‌న ఉత్ప‌త్తుల్లో పేటెంట్ మందులు, జెనరిక్ మెడిసిన్స్‌, స్నాక్స్‌, బేక‌రీ ఫుడ్స్‌, మ‌సాలా దినుసులు, స్నాన‌పు స‌బ్బులు, డిట‌ర్జెంట్లు వ‌గైరా ఉన్నాయి. ప్యాకింగులో లోపాలు, బ్రాండింగ్‌లో అవ‌క‌త‌వ‌క‌లు, క‌ల్తీ, కాలుష్యం త‌దిత‌రాల‌ను అమెరికా కార‌ణాలుగా పేర్కొంది. ఈ ఏడాది ఒక్క జ‌న‌వ‌రి నెల‌లోనే 228 ఉత్ప‌త్తుల‌ను రిజ‌క్ట్ చేసింది. ఆంధ్రప్ర‌దేశ్ నుండి వెళ్లిన రెండు ఉత్ప‌త్తుల‌ను సైతం అమెరికా క‌ల్తీని కార‌ణంగా చూపి కాదంది.

ఇదే విష‌యం గురించి బ‌యోకాన్ సి ఎమ్ డి కిర‌ణ్ మ‌జుందార్‌ని అడిగితే ఉత్ప‌త్తుల‌కు సంబంధించి స‌మ‌గ్ర‌మైన వివ‌రాలు అందించ‌డంలో లోపాల నుండి, ఉత్ప‌త్తుల విష‌యంలో ప‌రిశుభ్ర‌త లోపించ‌డం వ‌ర‌కు ప‌లుర‌కాల కార‌ణాలు ఉన్నాయ‌న్నారు. వారినుండి మ‌న‌కు అందుతున్న లెట‌ర్ల‌లో ఆ వివ‌రాల‌న్నీ ఉంటున్నాయ‌ని ఆమె తెలిపారు. ఆహారం, మందుల ఉత్ప‌త్తుల విష‌యంలో మ‌న వాళ్ల నిర్ల‌క్ష్యాన్ని ఇవి నిరూపిస్తున్నాయి.

అమెరికా, యూరప్ నుంచి మనదేశంలోకి దిగుమతి అవుతున్న లేదా ఆయా దేశాలు మనదేశంలో ఉత్పత్తిచేస్తున్న వస్తువులు గొప్ప క్వాలిటీలో ఉంటున్నాయా అంటే ఉండడంలేదనే చెప్పొచ్చు. కోకోకోలా లాంటి ఉత్పత్తులను తీసుకోండి. వాటిపై ఎలాంటి విమర్శలు వచ్చాయో అందరికి తెలుసు. కానీ వాటిని రిజెక్ట్ చేసే ధైర్యం మన నాయకులకు లేదు. వాళ్లు ఎంత చెత్తగా ఉత్పత్తిచేసినా లంచాలు తీసుకొని మన అధికారులు అనుమతులిస్తారు. మన నాయకులు అధికారంలో ఉండాలంటే అమెరికా అనుగ్రహం కావాలి. అందుకే ఆర్ధిక విషయాల్లో వాళ్లకు బానిసల్లా వ్యవహరిస్తారు. కనీసం ప్రజలైనా తెలుసుకొని విదేశీ వస్తువులను వేలం వెర్రిగా కొనడం తగ్గిస్తే ఆ దేశాలకు బుద్ధివస్తుందేమో!

First Published:  9 Feb 2016 2:04 AM GMT
Next Story