Telugu Global
Cinema & Entertainment

రోజులు మారాయ్ వెంకీ బాబు....

 ఒకప్పుడు హీరో కోసం హీరోయిన్ వెయిట్ చేసేది. హీరోయిన్ ఎం ఖర్మ టోటల్ టీం అంతా హీరో కోసం పడిగాపులు కాసేది. అతడు వచ్చిన తర్వాతే సెట్స్ పై ఉత్సాహం కనిపిస్తుంది. కానీ ఈమధ్య కొన్ని సినిమాల విషయంలో ఈ ఫార్ములా రివర్స్ అయింది. హీరోయిన్ కోసం టోటల్ యూనిట్ అంతా వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. బాలీవుడ్ లో అయితే కత్రినాకైఫ్, దీపికా పదుకోన్ లాంటి భామలు ఇప్పటికే ఈ స్టేటస్ అనుభవిస్తుండగా…. సౌత్ లో […]

రోజులు మారాయ్ వెంకీ బాబు....
X
ఒకప్పుడు హీరో కోసం హీరోయిన్ వెయిట్ చేసేది. హీరోయిన్ ఎం ఖర్మ టోటల్ టీం అంతా హీరో కోసం పడిగాపులు కాసేది. అతడు వచ్చిన తర్వాతే సెట్స్ పై ఉత్సాహం కనిపిస్తుంది. కానీ ఈమధ్య కొన్ని సినిమాల విషయంలో ఈ ఫార్ములా రివర్స్ అయింది. హీరోయిన్ కోసం టోటల్ యూనిట్ అంతా వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. బాలీవుడ్ లో అయితే కత్రినాకైఫ్, దీపికా పదుకోన్ లాంటి భామలు ఇప్పటికే ఈ స్టేటస్ అనుభవిస్తుండగా…. సౌత్ లో సమంత, రకుల్ ప్రీత్ సింగ్, నయనతార లాంటి భామలు ఈ కేటగిరీలోకి వస్తాయి. అయితే అలా హీరోయిన్ కోసం వెయిట్ చేస్తున్న సదరు హీరో ఏకంగా విక్టరీ వెంకటేశ్ అవ్వడం ఇక్కడ బాధాకరం. అవును… నయన్ కోసం వెంకీ కళ్లుకాయలు కాచేలా ఎదురుచూస్తున్నాడు. మారుతి దర్శకత్వంలో చేస్తున్న బాబు బంగారం సినిమా కోసం నయనతారను ఏరికోరి తీసుకున్నారు. అయితే తమిళ సినిమాలతో బిజీగా ఉన్న నయన్ మాత్రం మన బాబుకి హ్యాండ్ మీద హ్యాండ్ ఇస్తూనే ఉంది. దీంతో తన సోలో సన్నివేశాలు పూర్తిచేసిన వెంకీ… ప్రస్తుతం నయనతార కోసం వెయిటింగ్. ఆమె రావాలి… సినిమా స్టార్ట్ కావాలి. ఆ తర్వాతే బాబు బంగారం విడుదల తేదీపై ఓ క్లారిటీ వస్తుంది. అదీ సంగతి
First Published:  11 Feb 2016 11:16 AM GMT
Next Story