Telugu Global
Cinema & Entertainment

రాంచ‌ర‌ణ్   ఇమేజ్ ను మార్చే క‌థ  సిద్ధ‌మా..!

యాక్ష‌న్ చిత్రాలు చేసే ఆడియ‌న్స్ కు మాస్ ఇమేజ్  వ‌ద్ద‌న్న వ‌చ్చేస్తుంది. ఆఫ్ కోర్స్  సూప‌ర్ స్టార్స్ కావాల‌న్న  మాస్ ఆడియ‌న్స్  దీవెనెలు ఉంటేనే సాధ్య ప‌డుతుంది. లేక పోతే అంతే సంగ‌తులు. హీరోగా  రాంచ‌ర‌ణ్, ఎన్టీఆర్,  ప్ర‌భాస్ అంద‌రు మాస్ ఇమేజ్ వున్న హీరోలే.  మ‌హేష్ బాబు, ప‌వ‌ర్ స్టార్ ల‌కు  అన్నీ వ‌ర్గాల ఆడియ‌న్స్ లో  ఫాలోయింగ్ వుంది.    అలా పోల్చి చూస్తే..రాంచ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ల‌కు  కొంత క్లాస్  ఆడియ‌న్స్ ఫాలోయింగ్ త‌క్కువ‌నే చెప్పాలి. […]

రాంచ‌ర‌ణ్   ఇమేజ్ ను మార్చే క‌థ  సిద్ధ‌మా..!
X

యాక్ష‌న్ చిత్రాలు చేసే ఆడియ‌న్స్ కు మాస్ ఇమేజ్ వ‌ద్ద‌న్న వ‌చ్చేస్తుంది. ఆఫ్ కోర్స్ సూప‌ర్ స్టార్స్ కావాల‌న్న మాస్ ఆడియ‌న్స్ దీవెనెలు ఉంటేనే సాధ్య ప‌డుతుంది. లేక పోతే అంతే సంగ‌తులు. హీరోగా రాంచ‌ర‌ణ్, ఎన్టీఆర్, ప్ర‌భాస్ అంద‌రు మాస్ ఇమేజ్ వున్న హీరోలే. మ‌హేష్ బాబు, ప‌వ‌ర్ స్టార్ ల‌కు అన్నీ వ‌ర్గాల ఆడియ‌న్స్ లో ఫాలోయింగ్ వుంది. అలా పోల్చి చూస్తే..రాంచ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ ల‌కు కొంత క్లాస్ ఆడియ‌న్స్ ఫాలోయింగ్ త‌క్కువ‌నే చెప్పాలి. అయితే 'నాన్న‌కు ప్రేమ‌తో' సినిమా ఎన్టీఆర్ కు క్లాస్ ఆడియ‌న్స్ ఫాలోయింగ్ ను పెంచింద‌నే చెప్పాలి. ద‌ర్శ‌కుడు సుకుమార్ చేసిన ఈ చిత్రం ఓవ‌ర్సీస్ లో బాగా న‌డిచింది. తెలుగు నాట మాస్ ఆడియ‌న్స్ ను పెద్ద‌గా అల‌రించ‌క పోయిన‌ప్ప‌టికి.. ఓవ‌ర్సీస్ లో మాత్రం మంచి క్రేజ్ తెచ్చింది. ఎన్టీఆర్ కు కొత్త లుక్ ఇచ్చాడు. కొత్త ఇమేజ్ ను తెచ్చాడు.

ఇక తాజా వార్త ఏమిటంటే.. ప్ర‌స్తుతం డైరెక్ట‌ర్ సురెంద‌రెడ్డి తో 'త‌న్నీ ఒరువ‌న్' చిత్రం రీమేక్ ప‌నిలో ప‌డ్డాడు. ఈ చిత్రం అవ్వ‌గానే రాంచ‌ర‌ణ్ ..ద‌ర్శ‌కుడు సుకుమార్ తో ఒక సినిమా చేయ‌డానికి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడ‌ని స‌మాచారం. ఈ మ‌ధ్య‌నే డైరెక్ట‌ర్ సుకుమార్ ఒక క‌థ‌ను రాంచ‌ర‌ణ్ కు వినిపించాడ‌ట‌. అది రాంచ‌ర‌ణ్ కు న‌చ్చింద‌ని టాక్. ఈ చిత్రం రాంచ‌ర‌ణ్ కు క్లాస్ ఇమేజ్ తెస్తుంద‌ని . ..రాంచ‌ర‌ణ్ కూడా ఓవ‌ర్సీస్ లో క‌లెక్ష‌న్ల పరంగా త‌న కో -హీరోస్ కంటే బాగా వెన‌క బ‌డి వుండ‌టంతో.. సుకుమార్ తో సినిమా చేయ‌డానికి క‌మిటైయ్యాడ‌ని టాక్.

First Published:  11 Feb 2016 12:23 AM GMT
Next Story