Telugu Global
Cinema & Entertainment

ఆ సినిమాని చెర్రీ వద్దనుకున్నాడు...

తుఫాన్ సినిమా రీమేక్ తర్వాత వెంటనే మరో రీమేక్ చేసే ఛాన్స్ వచ్చింది రామ్ చరణ్ కి. కానీ తుఫాన్ రీమేక్ అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో… మరో రీమేక్ జోలికి వెళ్లలేదు. అలా మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి ప్రాజెక్టు కొన్నేళ్లుగా ఆగిపోయింది. ఎట్టకేలకు మళ్లీ ఇప్పుడు మెగాకాంపౌండ్ లోనే తెరపైకి వచ్చింది ఈ ప్రాజెక్టు. అప్పట్లో రామ్ చరణ్ కాదన్న ఈ ప్రాజెక్టుకు ఇప్పుడు సాయిధర్మతేజ ఓకే చేశాడు. అవును… తాజాగా సాయిధర్మతేజ ఓకే చేసిన […]

ఆ సినిమాని చెర్రీ వద్దనుకున్నాడు...
X
తుఫాన్ సినిమా రీమేక్ తర్వాత వెంటనే మరో రీమేక్ చేసే ఛాన్స్ వచ్చింది రామ్ చరణ్ కి. కానీ తుఫాన్ రీమేక్ అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో… మరో రీమేక్ జోలికి వెళ్లలేదు. అలా మిస్టర్ అండ్ మిసెస్ రామాచారి ప్రాజెక్టు కొన్నేళ్లుగా ఆగిపోయింది. ఎట్టకేలకు మళ్లీ ఇప్పుడు మెగాకాంపౌండ్ లోనే తెరపైకి వచ్చింది ఈ ప్రాజెక్టు. అప్పట్లో రామ్ చరణ్ కాదన్న ఈ ప్రాజెక్టుకు ఇప్పుడు సాయిధర్మతేజ ఓకే చేశాడు. అవును… తాజాగా సాయిధర్మతేజ ఓకే చేసిన ఆ ప్రాజెక్టును గతంలో చెర్రీ చేయాల్సింది. ప్రస్తుతం సుప్రీం, తిక్క సినిమాలతో బిజీగా ఉన్న సాయిధర్మతేజ… ఈ రెండు మూవీల్లో ఒకటి కంప్లీట్ అయిన వెంటనే…. ఈ కన్నడ రీమేక్ ను తెరపైకి తెస్తాడు. కుదిరితే ఈ రీమేక్ ప్రాజెక్టు వ్యవహారాల్ని హరీష్ శంకర్ కు అప్పగించే పనిలో ఉన్నాడు. ఎందుకంటే…. గబ్బర్ సింగ్ లాంటి రీమేక్ ను నేటివిటీకీ, పవన్ స్టయిల్ కు తగ్గట్టు అద్భుతంగా మార్చి చూపించాడు హరీష్శంకర్. అందుకే అతడికే ఈ కన్నడ రీమేక్ ను అప్పగించాలనుకుంటున్నాడు. ఇప్పటికే వీళ్లిద్దరి కాంబినేషన్ లో సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ అనే సినిమా వచ్చింది. అన్నట్టు ఈ రీమేక్ విషయంలో…. మెగాస్టార్ చిరంజీవి కూడా సాయిధర్మతేజకు ఫుల్ సపోర్ట్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
First Published:  11 Feb 2016 7:09 AM GMT
Next Story