Telugu Global
Cinema & Entertainment

చిరంజీవి పెళ్లిప‌నుల్లో ఉన్నారా?

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో తాజాగా బాజా భ‌జంత్రీలు మోగ‌నున్నాయి… అనే వార్త‌ ఒక‌టి ఇప్ప‌టికే హ‌ల్‌చ‌ల్ చేస్తున్న నేప‌థ్యంలో ఈ ఫొటో అందుకు ఊత‌మిస్తున్న‌ట్టుగా ఉంది. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ‌కు అమెరికాలో సెటిలైన చిత్తూరుకి చెందిన వ్య‌క్తితో  వివాహం కుదిరింద‌ని, స‌న్నిహితుల స‌మ‌క్షంలో ఎంగేజ్‌మెంట్ కూడా జ‌రిగింద‌నీ స‌మాచారం. ఈ వార్త‌ల‌పై మెగాకాంపౌండ్ స్పందించ‌క‌పోవ‌డంతో ఇది నిజ‌మేన‌ని భావించాల్సివ‌స్తోంది. దానికితోడు చిరంజీవి కుటుంబం పెళ్లిప‌నుల్లో హ‌డావుడిగా ఉన్న‌ద‌నేందుకు నిద‌ర్శ‌నంగా ఈ ఫొటోలో ఉన్న స‌న్నివేశాలు క‌న‌బ‌డుతున్నాయి. […]

చిరంజీవి పెళ్లిప‌నుల్లో ఉన్నారా?
X

1455252933-1411మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో తాజాగా బాజా భ‌జంత్రీలు మోగ‌నున్నాయి… అనే వార్త‌ ఒక‌టి ఇప్ప‌టికే హ‌ల్‌చ‌ల్ చేస్తున్న నేప‌థ్యంలో ఈ ఫొటో అందుకు ఊత‌మిస్తున్న‌ట్టుగా ఉంది. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ‌కు అమెరికాలో సెటిలైన చిత్తూరుకి చెందిన వ్య‌క్తితో వివాహం కుదిరింద‌ని, స‌న్నిహితుల స‌మ‌క్షంలో ఎంగేజ్‌మెంట్ కూడా జ‌రిగింద‌నీ స‌మాచారం.

ఈ వార్త‌ల‌పై మెగాకాంపౌండ్ స్పందించ‌క‌పోవ‌డంతో ఇది నిజ‌మేన‌ని భావించాల్సివ‌స్తోంది. దానికితోడు చిరంజీవి కుటుంబం పెళ్లిప‌నుల్లో హ‌డావుడిగా ఉన్న‌ద‌నేందుకు నిద‌ర్శ‌నంగా ఈ ఫొటోలో ఉన్న స‌న్నివేశాలు క‌న‌బ‌డుతున్నాయి. ఇటీవ‌లే భుజానికి ఆప‌రేష‌న్ చేయించుకున్న చిరంజీవి చేతికి క‌ట్టుతోనే భార్య సురేఖ‌తో క‌లిసి పెళ్లి వేడుక‌ల్లో పాలుపంచుకుంటున్న‌ట్టుగా ఇందులో ఉంది. శ్రీజ నిశ్చితార్థానికి ప‌వ‌న్‌క‌ల్యాణ్ సైతం హాజ‌ర‌య్యాయ‌ని స‌మాచారం.

First Published:  12 Feb 2016 12:27 AM GMT
Next Story