Telugu Global
CRIME

విడాకులు ఇవ్వ‌నందుకు చంపేశాడు!

అత‌ను విద్యావంతుడు, ఆటోమొబైల్ ఇంజినీర్‌గా ప‌నిచేస్తున్నాడు. ముంబ‌యిలో అసిస్టెంటు పోలీస్ ఇన్‌స్పెక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్న వ్య‌క్తి కుమారుడు… ఇవ‌న్నీ వింటే మ‌నం స‌ద‌రు వ్య‌క్తి మంచివాడే అయివుంటాడ‌ని అనుకుంటాం. . కానీ అత‌ను క‌నీస మాన‌వ‌త్వం కూడా లేని మ‌నిషి,   విడాకులు ఇవ్వ‌లేద‌ని క‌ట్టుకున్న భార్య‌ని దారుణంగా హ‌త‌మార్చాడు.  రాకేష్ ర‌మేష్ నౌక‌డ్క‌ర్ స‌వితల వివాహం 2012లో జ‌రిగింది. రాకేష్ ఆటోమొబైల్ ఇంజినీర్ కాగా స‌విత ఖ‌ర్‌గ‌ర్‌లోని ఒక అడ్వ‌ర్ట‌యిజింగ్ కంపెనీలో ప‌నిచేస్తోంది. వాళ్లిద్ద‌రూ వ‌ర్లిలో ఉంటున్నారు. కాగా […]

విడాకులు ఇవ్వ‌నందుకు చంపేశాడు!
X

అత‌ను విద్యావంతుడు, ఆటోమొబైల్ ఇంజినీర్‌గా ప‌నిచేస్తున్నాడు. ముంబ‌యిలో అసిస్టెంటు పోలీస్ ఇన్‌స్పెక్ట‌ర్‌గా ప‌నిచేస్తున్న వ్య‌క్తి కుమారుడు… ఇవ‌న్నీ వింటే మ‌నం స‌ద‌రు వ్య‌క్తి మంచివాడే అయివుంటాడ‌ని అనుకుంటాం. . కానీ అత‌ను క‌నీస మాన‌వ‌త్వం కూడా లేని మ‌నిషి, విడాకులు ఇవ్వ‌లేద‌ని క‌ట్టుకున్న భార్య‌ని దారుణంగా హ‌త‌మార్చాడు. రాకేష్ ర‌మేష్ నౌక‌డ్క‌ర్ స‌వితల వివాహం 2012లో జ‌రిగింది. రాకేష్ ఆటోమొబైల్ ఇంజినీర్ కాగా స‌విత ఖ‌ర్‌గ‌ర్‌లోని ఒక అడ్వ‌ర్ట‌యిజింగ్ కంపెనీలో ప‌నిచేస్తోంది. వాళ్లిద్ద‌రూ వ‌ర్లిలో ఉంటున్నారు. కాగా రాకేష్‌కి మ‌రొక మ‌హిళ‌తో వివాహేత‌ర సంబంధం ఏర్ప‌డ‌టంతో భార్య‌ను విడాకులు ఇవ్వ‌మ‌ని వేధించ‌సాగాడు.

విడాకులు తీసుకుని మ‌రో వివాహం చేసుకోవాల‌ని అనుకున్నాడు. స‌విత అందుకు నిరాక‌రించ‌డంతో ఇద్ద‌రి మ‌ధ్యా త‌ర‌చుగా గొడ‌వ‌లు జ‌రుగుతుండేవి. ఈ నేప‌థ్యంలో నాలుగురోజుల క్రితం రాకేష్, స‌విత ఆఫీస్‌కి వెళ్లి, ఇంటికి వెల్దామంటూ ఆమెను మోటార్‌సైకిల్ ఎక్కించుకున్నాడు. మార్గ‌మ‌ధ్యంలో నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో ఆమె గొంతునులిమి చంప‌డ‌మే కాకుండా, మొహం మీద రాయితో మోదాడు. దాంతో స‌రిత మ‌ర‌ణించింది.

నేవీ ముంబ‌యిలోని పామ్‌బీచ్ రోడ్డులో స‌రిత మృత‌దేహాన్ని చూసిన స్థానికులు ఎన్నారై పోలీస్ స్టేష‌న్‌కి స‌మాచారం అందించారు. పోలీసులు స‌విత వివ‌రాలు తెలుసుకుని రాకేష్‌ని విచారించారు. అత‌ని వివాహేత‌ర సంబంధం, గొడ‌వ‌ల గురించి తెలుసుకున్నారు. పోలీసుల ఇంట‌రాగేష‌న్‌లో రాకేష్ తానే హ‌త్య‌చేసిన‌ట్టుగా ఒప్పుకున్నాడు. అత‌నిమీద హ‌త్య‌కేసు న‌మోదు చేసి అరెస్టు చేశారు.. పామ్‌బీచ్ హైవేమీదున్న సిసిటివి ఫుటేజ్‌, భార్యాభ‌ర్త‌ల ఇరువురి సెల్‌ఫోన్ డాటాని బ‌ట్టి పోలీసులు హ‌త్య‌కు సంబంధించిన ఆధారాలు సేక‌రించారు. ఈ హ‌త్య‌లో ఇంకెవ‌రి ప్ర‌మేయం క‌న‌బ‌డ‌టం లేద‌ని వారు చెబుతున్నారు.

First Published:  13 Feb 2016 3:23 AM GMT
Next Story