Telugu Global
NEWS

ఒకళ్లు తప్పుచేస్తే మరొకళ్లను జైలుకు పంపిస్తారా?

ఈ నెల 22 నుంచి ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంగించే వారిని కఠినంగా శిక్షించేందుకు ట్రాఫిక్‌ పోలీసులు కొత్త శిక్షలు విధించేందుకు సిద్ధమౌతున్నారు. వాహనాలు నడిపేవాళ్లలో ఎక్కువ మందికి ట్రాఫిక్‌సెన్స్‌ లేదు. నిబంధనలను పట్టించుకోరు. కేర్‌లెస్‌గా డ్రైవ్‌చేసి ప్రమాదాలకు కారణమౌతున్నారు. వీళ్లను దారికి తేవడానికి ట్రాఫిక్‌ పోలీసులు కొత్త నిబంధనలను అమలుచేయనున్నారు. అతివేగంగా డ్రైవ్‌చేసినా తాగి డ్రైవ్‌చేసినా రెడ్‌ సిగ్నల్స్‌ జంప్‌చేసినా సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవ్‌చేసినా ఓవర్‌ లోడింగ్‌తో డ్రైవ్‌చేసినా ఈ అయిదింటిలో ఏ మూడు నేరాలకు పాల్పడినా […]

ఒకళ్లు తప్పుచేస్తే మరొకళ్లను జైలుకు పంపిస్తారా?
X

ఈ నెల 22 నుంచి ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంగించే వారిని కఠినంగా శిక్షించేందుకు ట్రాఫిక్‌ పోలీసులు కొత్త శిక్షలు విధించేందుకు సిద్ధమౌతున్నారు. వాహనాలు నడిపేవాళ్లలో ఎక్కువ మందికి ట్రాఫిక్‌సెన్స్‌ లేదు. నిబంధనలను పట్టించుకోరు. కేర్‌లెస్‌గా డ్రైవ్‌చేసి ప్రమాదాలకు కారణమౌతున్నారు. వీళ్లను దారికి తేవడానికి ట్రాఫిక్‌ పోలీసులు కొత్త నిబంధనలను అమలుచేయనున్నారు.

  • అతివేగంగా డ్రైవ్‌చేసినా
  • తాగి డ్రైవ్‌చేసినా
  • రెడ్‌ సిగ్నల్స్‌ జంప్‌చేసినా
  • సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవ్‌చేసినా
  • ఓవర్‌ లోడింగ్‌తో డ్రైవ్‌చేసినా

ఈ అయిదింటిలో ఏ మూడు నేరాలకు పాల్పడినా వాళ్ల డ్రైవింగ్‌ లైసెన్స్‌ కొంత కాలంపాటు రద్దవుతుంది. లైసెన్స్‌ రద్దు అయిన పీరియడ్‌లో డ్రైవ్‌చేస్తే వాళ్లను కోర్టులో హాజరుపరిచి జైలు శిక్ష విధిస్తారు.
అలాగే మైనర్లు డ్రైవ్‌ చేసినప్పుడు వాళ్లను, వాళ్లకు వాహనము ఇచ్చిన వారిపైన కూడా కేసులు నమోదుచేస్తారు.

నిజానికి ఈ నిర్ణయాలు అన్ని చాలా బాగున్నాయి. ఏమాత్రం ట్రాఫిక్‌ సెన్స్‌లేని చాలామందిని దారిలోపెడతాయి. ఈ నిర్ణయాలను అందరూ ఆహ్వానించవలసిందే. అయితే చిక్కు ఎక్కడ వస్తుందంటే – వాహనం ఎవరు కొనుక్కుంటారో, ఎవరి పేరుతో రిజిస్టర్‌ అయి ఉంటుందో వాళ్లే నడపరు. నగరంలో నడిచే అనేక కార్లు కుటుంబ యజమానిపేరుతోనో, యజమానురాలి పేరుతోనే, సంస్థల పేరుతోనో రిజిస్టరయి ఉంటాయి. ఉద్యోగులైన డ్రైవర్లు నడుపుతుంటారు. యజమాని కారులో ఉన్నప్పుడు జాగ్రత్తగా నడుపుతూ ఫోన్‌లో మాట్లాడకుండా, సిగ్నల్‌ జంప్‌ చేయకుండా, వేగంగా నడపకుండా ఉండే డ్రైవరు తను ఒంటరిగా డ్రైవ్‌ చేసేటప్పుడు నిర్లక్ష్యంగా నడిపి నిబంధనలను ఉల్లంగిస్తే దానికి యజమాని బాధ్యుడవుతాడా? డ్రైవింగ్‌ లైసెన్స్‌ కూడా లేని కొందరు స్త్రీల పేరుమీద కార్లు ఉన్నాయి. వాటిని డ్రైవర్లు నడుపుతుంటారు. డ్రైవర్లు చేసే తప్పులకు ఆ స్త్రీలను కోర్టులో హాజరు పరుస్తారా?

డ్రంకన్‌ డ్రైవ్‌లో లాగా పై నేరాలు చేసేవాళ్లను అక్కడే పట్టుకుని వాళ్ల డ్రైవింగ్‌ లైసెన్స్‌ నెంబరు, నడిపేవారి పేరు తెలుసుకుని వాళ్లమీద నేరాలు నమోదుచేస్తే బాగుంటుంది. అంతేగాని సిసి కెమెరాల సాయంతో కారు నెంబర్ ఆధారంగా కేసులు నమోదుచేస్తే ఒకళ్లు తప్పుచేస్తే మరొకళ్లను జైలుకు పంపించినట్లు అవుతుంది.

అలాగే పెద్ద పెద్ద వాహన సంస్థలు పాత వాహనాలు తీసుకుని, కొంత డబ్బు కట్టించుకుని వాటి స్థానంలో కొత్త వాహనాలను ఇస్తున్నాయి. పాత యజమాని నుంచి కొత్త యజమానికి వాహనాల ట్రాన్స్‌ఫర్‌ చట్టప్రకారం జరగడంలేదు. నిబంధనలను తుంగలో తొక్కి అడ్డగోలుగా ప్రవర్తిస్తూ ఎవరికంటే వాళ్లకు అమ్మేస్తున్నారు. వాహన పాత యజమానులకు ట్రాఫిక్‌ విభాగం నుంచి జరిమాన చలానాలు వస్తున్నాయి. తమ దగ్గర పాత వాహనాలు తీసుకున్నవాళ్లను అడిగితే సరైన సమాధానం రావడం లేదు. ఏం చేయాలో తోచక పాత యజమానులు ఫైన్‌లు కట్టుకుంటూ కళ్లనీళ్ల పర్యంతం అవుతున్నారు. నిబంధనలను పాటించని ఇలాంటి వెహికల్‌ ఎక్స్‌చేంజ్‌ మేళాలపై పోలీసులు ఉక్కుపాదం మోపితే సరైన అడ్రస్‌ వివరాలు లేకుండా నడిపే వాహనాల సంఖ్య విపరీతంగా తగ్గిపోతుంది.

First Published:  13 Feb 2016 5:14 AM GMT
Next Story