Telugu Global
Cinema & Entertainment

ముచ్చటగా మూడోసారి ఎన్టీఆర్ సినిమా వాయిదా

సెట్స్ పైకి వెళ్లకముందే ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి వాయిదాల పర్వం నడుస్తోంది. ఈ సినిమా ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ అనుకోని కారణాల వల్ల ఈనెల 16కు సినిమా రెగ్యులర్ షూటింగ్ ను వాయిదా వేశారు. అయితే తాజాగా మరోసారి సినిమా వాయిదా పడింది. అంతా అనుకున్నట్టు ఈనెల 16న కాకుండా…. 25 నుంచి ఎన్టీఆర్ కొత్త సినిమా జనతా గ్యారేజీ సెట్స్ పైకి వెళ్తుంది. ఈ మూవీ ఎందుకిలా వాయిదా పడుతోందో ఎవరికీ తెలీదు […]

ముచ్చటగా మూడోసారి ఎన్టీఆర్ సినిమా వాయిదా
X
సెట్స్ పైకి వెళ్లకముందే ఎన్టీఆర్ సినిమాకు సంబంధించి వాయిదాల పర్వం నడుస్తోంది. ఈ సినిమా ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉంది. కానీ అనుకోని కారణాల వల్ల ఈనెల 16కు సినిమా రెగ్యులర్ షూటింగ్ ను వాయిదా వేశారు. అయితే తాజాగా మరోసారి సినిమా వాయిదా పడింది. అంతా అనుకున్నట్టు ఈనెల 16న కాకుండా…. 25 నుంచి ఎన్టీఆర్ కొత్త సినిమా జనతా గ్యారేజీ సెట్స్ పైకి వెళ్తుంది. ఈ మూవీ ఎందుకిలా వాయిదా పడుతోందో ఎవరికీ తెలీదు కానీ…. ఈ మూవీకి సంబంధించిన సెట్ మాత్రం భారీ స్థాయిలో సిద్ధమైంది. సారధి స్టూడియోస్ లో ఆటోగ్యారేజీ సెట్ ను భారీగా నిర్మించారు. 25నుంచే అక్కడే షూటింగ్ ఉంటుంది. ఆ తర్వాత సెకెండ్ షెడ్యూల్ ముంబయిలో ప్లాన్ చేశారు. మాఫియా బ్యాక్ డ్రాప్ లో కొన్ని సన్నివేశాల్ని తెరకెక్కిస్తారు. దాదాపు 20 రోజుల పాటు ముంబయిలో షెడ్యూల్ ఉంటుంది. ప్రస్తుతానికైతే రెండు షెడ్యూల్స్ డేట్స్ ప్రకటించినప్పటికీ… మళ్లీ వాయిదా పడుతుందేమో అనే చిన్న అనుమానం మాత్రం నందమూరి అభిమానుల మనసుల్లో గూడుకట్టుకొని ఉంది. సమంత-నిత్యామీనన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు కొరటాల శివ దర్శకుడు.
Click on Image to Read:
rajamouli-jr-ntr
sunny-leone
First Published:  14 Feb 2016 5:56 AM GMT
Next Story