Telugu Global
Health & Life Style

ఆహా...ఇలా చేస్తే ఆనంద‌మే ఆనందమ‌ట‌!

ప‌రిస్థితుల‌తో సంబంధం లేకుండా కొన్ని ప‌నులు ఆనందాన్ని ఇస్తాయ‌ని ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. తాత్కాలికంగా వ‌చ్చే బాధ‌ల‌కు, ఒత్తిళ్ల‌కు వీటిని తాత్కాలిక ప‌రిష్కారాలుగా వాడుకోవ‌చ్చు.  వీటినే దీర్ఘ‌కాలం సాధ‌న చెస్తే ఆనందంగా ఉండ‌టం అల‌వాటుగానూ మారుతుంది. అందుకే ఇవి ఆనందానికి రుజు మార్గాలు….రుజువైన మార్గాలు.  చాలా ర‌కాల అనారోగ్యాల‌ను, డిప్రెష‌న్‌ని ఇవి దూరం చేస్తాయి- చ‌క్క‌ని ప‌చ్చిక మైదానంలో ప్ర‌తి‌రోజూ క‌నీసం ప‌దినిముషాలైనా న‌డిస్తే శ‌రీరంలో అన్ని వ్య‌వ‌స్థ‌లు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయ‌డానికి సిద్ధ‌మ‌వుతాయి. హాయిని గొలిపే పాట‌లు, సంగీతం  […]

ఆహా...ఇలా చేస్తే ఆనంద‌మే ఆనందమ‌ట‌!
X

ప‌రిస్థితుల‌తో సంబంధం లేకుండా కొన్ని ప‌నులు ఆనందాన్ని ఇస్తాయ‌ని ప‌రిశోధ‌న‌ల్లో తేలింది. తాత్కాలికంగా వ‌చ్చే బాధ‌ల‌కు, ఒత్తిళ్ల‌కు వీటిని తాత్కాలిక ప‌రిష్కారాలుగా వాడుకోవ‌చ్చు. వీటినే దీర్ఘ‌కాలం సాధ‌న చెస్తే ఆనందంగా ఉండ‌టం అల‌వాటుగానూ మారుతుంది. అందుకే ఇవి ఆనందానికి రుజు మార్గాలు….రుజువైన మార్గాలు. చాలా ర‌కాల అనారోగ్యాల‌ను, డిప్రెష‌న్‌ని ఇవి దూరం చేస్తాయి-

  • చ‌క్క‌ని ప‌చ్చిక మైదానంలో ప్ర‌తి‌రోజూ క‌నీసం ప‌దినిముషాలైనా న‌డిస్తే శ‌రీరంలో అన్ని వ్య‌వ‌స్థ‌లు స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయ‌డానికి సిద్ధ‌మ‌వుతాయి.
  • హాయిని గొలిపే పాట‌లు, సంగీతం వింటే మైండ్ రిలాక్స‌వుతుంది. మెద‌డులో పీల్‌గుడ్ హార్మోన్లు డోప‌మైన్ లాంటివి పెరుగుతాయి. గుండె వేగం, ర‌క్త‌పోటు స‌రిగ్గా ఉంటాయి. ఒత్తిడి త‌గ్గుతుంది.
  • ఎంత ఒత్తిడిలో ఉన్నా దీర్ఘంగా శ్వాస తీసుకుంటే శ‌రీరంలో టెన్ష‌న్ వ‌దులుతుంది.
  • ఒత్తిడిని నివారించేందుకు చాక్‌లెట్ లేదా న‌చ్చిన స్వీటు బాగా ప‌నిచేస్తుంది. అయితే దీన్ని త‌ర‌చుగా వాడ‌కుండా చూసుకోవాలి.
  • భోజ‌నం త‌రువాత తీసే చిన్న‌పాటి కునుకు ఎంతో ప్ర‌యోజ‌నాన్ని ఇస్తుంది. యాంగ్జ‌యిటీ, ర‌క్త‌పోటు లాంటి వాటిని చ‌క్క‌బ‌రుస్తుంది. మెద‌డు ప‌నితీరుని మెరుగుప‌రుస్తుంది.
  • చూయింగ్‌గ‌మ్ అల‌వాటు మ‌రీ అంత చెడ్డ‌దేం కాదు. ఇది శ్వాసకి తాజాద‌నాన్ని ఇవ్వ‌డంతో పాటు ఒత్తిడిని, యాంగ్జ‌యిటీని క‌లిగించే కార్టిసాల్ ఉత్ప‌త్తిని త‌గ్గిస్తుంది.
  • ఆలోచ‌న‌ల‌ను పేప‌రుమీద పెట్ట‌డం చాలా మంచి అల‌వాటు. అలా రాసిన‌పుడు మ‌న మ‌న‌సంతా మ‌న ఎదురుగా ఉన్న‌ట్టుగా ఉంటుంది. ఇది మ‌న ప‌ట్ల మ‌న‌కు ఒక స్ప‌ష్ట‌త‌ను, అవ‌గాహ‌న‌ను పెంచుతుంది. అయోమ‌యం త‌గ్గుతుంది. మ‌న‌శ్శాంతి పెరుగుతుంది.
  • బాగా చిరాగ్గా, గంద‌ర‌గోళంగా ఉన్న‌ప్పుడు చ‌క్క‌ని అంద‌మైన‌, ప్ర‌శాంత‌మైన ప్ర‌దేశంలో ఉన్న‌ట్టు ఊహించాలి. ఇది కూడా ఒత్తిడిని త‌గ్గిస్తుంది.
  • చెప్పాలంటే వ్యాయామం మ‌న‌కు ఆక్సిజ‌న్ లాంటిదే. కొన్ని నిముషాలు వ్యాయామం చేసినా ఒత్తిడికి చెక్ చెప్పే ఎండార్ఫిన్లు విడుద‌ల అవుతాయి.

ఇంకా ఒక క‌ప్పు టీ చాలా విశ్రాంతి భావ‌న‌ను క‌లిగిస్తుంది. ఆత్మీయుల హ‌గ్ కూడా ఆనందాన్ని క‌లిగిస్తుంది. మంచి న‌వ్వుకూడా మ‌న‌లో ఆక్సిజ‌న్ తీసుకునే శ‌క్తిని పెంచుతుంది. గుండె, ఊపిరితిత్తులు, కండ‌రాలు అన్నీ స్వాంత‌న పొందుతాయి. ఒక ఆకుప‌చ్చ‌ని చెట్టున్న‌ కుండీని కొని క‌ళ్ల‌ముందు ఉంచుకోండి. దాన్ని చూస్తూ ఉంటే, ఆ గాలి పీలుస్తుంటే ఒత్తిడి, చిరాకు లాంటివి త‌గ్గుతాయి.

First Published:  15 Feb 2016 6:00 AM GMT
Next Story