Telugu Global
International

స్నేహితుడా...శ‌త్రుదేశ‌పు స్నేహితుడా!

పాకిస్తాన్ మ‌న దృష్టిలో ఎప్పుడూ దాయాది దేశమే.  అలాగే అక్క‌డి వారికి కూడా మ‌న‌మీద అలాంటి అభిప్రాయ‌మే ఉంటుంద‌న‌డంలో ఏమాత్రం సందేహం లేదు. రాజ‌కీయంగా దేశాల మ‌ధ్య చిచ్చు ఎప్పుడూ ర‌గులుతూనే ఉంటుంది. దాన్ని పాల‌కులు పెంచిపోషిస్తూనే ఉంటారు.   అక్క‌డి ప్ర‌జ‌లను ఇక్క‌డి ప్ర‌జ‌ల‌ను మాన‌సికంగా క‌లిపి ఉంచేందుకు సినిమాలు, వివిధ సాంస్కృతిక క‌ళారంగాలు ఎప్ప‌టిక‌ప్ప‌డు త‌మ ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఎన్నారై సామీ అనే సోష‌ల్ ఆన్‌లైన్ రేడియో అలాంటి ఒక చ‌క్క‌ని ప్ర‌య‌త్నాన్ని […]

స్నేహితుడా...శ‌త్రుదేశ‌పు స్నేహితుడా!
X

పాకిస్తాన్ మ‌న దృష్టిలో ఎప్పుడూ దాయాది దేశమే. అలాగే అక్క‌డి వారికి కూడా మ‌న‌మీద అలాంటి అభిప్రాయ‌మే ఉంటుంద‌న‌డంలో ఏమాత్రం సందేహం లేదు. రాజ‌కీయంగా దేశాల మ‌ధ్య చిచ్చు ఎప్పుడూ ర‌గులుతూనే ఉంటుంది. దాన్ని పాల‌కులు పెంచిపోషిస్తూనే ఉంటారు. అక్క‌డి ప్ర‌జ‌లను ఇక్క‌డి ప్ర‌జ‌ల‌ను మాన‌సికంగా క‌లిపి ఉంచేందుకు సినిమాలు, వివిధ సాంస్కృతిక క‌ళారంగాలు ఎప్ప‌టిక‌ప్ప‌డు త‌మ ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఎన్నారై సామీ అనే సోష‌ల్ ఆన్‌లైన్ రేడియో అలాంటి ఒక చ‌క్క‌ని ప్ర‌య‌త్నాన్ని చేసింది. త‌రాలు మారుతున్నా పాక్‌, భార‌త్‌ల మ‌ధ్య అన‌వ‌స‌ర విద్వేషాలు ఏదోఒక రూపంలో ర‌గులుతూనే ఉండ‌గా ఈ రేడియో మాత్రం ఇరుదేశాల చిన్నారుల మ‌న‌సుల్లో స్నేహ పుష్పాలు విర‌ బూయించాల‌ని ప్ర‌య‌త్నించింది.

సామీ రేడియో లాస్ ఏంజిల్స్‌నుండి ప‌నిచేస్తున్న సోష‌ల్ క‌మ్యునిటీ రేడియో. ఇందులో వివిధ దేశాల్లో ఉన్న భార‌తీయుల‌కు సంబంధించిన మంచి విష‌యాల‌ను, పాజిటివ్ అంశాల‌ను ప్ర‌సారం చేస్తారు. ఈ రేడియోలో న్యూయార్క్‌లో నివ‌సించే సురేష్ ఈడిగ అనే ఎన్నారై… కిడ్స్ బియాండ్ బోర్డ‌ర్స్ పేరుతో ఒక కార్య‌క్ర‌మాన్ని మొద‌లుపెట్టాడు. పాకిస్తాన్‌లోని పెషావ‌ర్ స్కూల్లో జ‌రిగిన ఉగ్ర‌వాద ఘాతుకాన్ని ఖండిస్తూ వారిలో ఆత్మ‌స్థ‌యిర్యాన్ని నింపేలా ఏదోఒక క‌ళా రూపాన్ని సృష్టించ‌మ‌ని భార‌త్‌లోని 20ఏళ్ల‌లోపు పిల్ల‌ల‌ను, యువ‌తీయువ‌కుల‌ను కోరాడు. అయితే ఈనేప‌థ్యంలో పాక్‌లోని చిన్నారులు, ఇండియాలోని పిల్ల‌ల‌కు స్నేహ‌పూరితంగా పంపిన ఉత్త‌రాలు, గ్రీటింగ్స్ ఎన్నో సామీ రేడియోకి చేరాయి. పాక్‌లోని చిన్నారులు శాంతిని, సౌహార్థ వాతావ‌ర‌ణాన్ని ఎంత‌గా కోరుతున్నారో ఇవి చెబుతున్నాయి. దేశాలు వైష‌మ్యాల‌తో కొట్టుకుంటున్నా, చిన్నారులు స్నేహాన్నే కోరుతున్నార‌ని, రానున్న‌ త‌రాల‌కు అలాంటి శాంతిపూరిత వాతావ‌ర‌ణాన్ని అందించ‌డం నేటిత‌రాల‌ బాధ్య‌త అని రుజువుచేసేలా ఉన్నాయ‌వి. హ్యాపీ న్యూ ఇయ‌ర్ అంటూ వ‌చ్చిన ఈ గ్రీటింగ్స్ ఎంతో హృద్యంగా పిల్ల‌ల హృద‌యాల‌కు అద్దం ప‌డుతున్న‌ట్టుగా ఉన్నాయి

.nri3 nri5 nri6 nri13 nri1 nri2

First Published:  14 Feb 2016 9:00 PM GMT
Next Story