నానికి ఓవర్సీస్ లో అలా కలిసొచ్చింది…

కృష్ణగాడి వీరప్రేమగాధ…. నాని కొత్త సినిమా ఇది. లోకల్ గా విడుదలైన ఈ సినిమా అన్ని సెంటర్లలో డీసెంట్ మార్కులు తెచ్చుకుంది. క్రిటిక్స్ ఎత్తేస్తున్నట్టు మరీ సూపర్ హిట్ అయిపోయేంత సరకు ఇందులో లేదు. కాకపోతే…. కచ్చితంగా ఒకసారి చూడొచ్చు. ఎట్ లీస్ట్ నాని యాక్టింగ్ కోసమైనా సినిమా థియేటర్ కు వెళ్లొచ్చు. ఇక ఓవర్సీస్ విషయానికొస్తే… అక్కడ కూడా ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. నాని సినిమాకు మొదటి రోజు నుంచే విదేశాల్లో క్యూ కట్టడం అనేది ఇప్పటివరకు ఎప్పుడూ జరగలేదు.
కానీ తొలిసారిగా నానికి సంబంధించి ఓవర్సీస్ గురించి కూడా మాట్లాడుకుంటున్నారంటే దానికి కారణం భలే భలే మగాడివోయ్ సినిమా. అవును… ఆ సినిమా విదేశాల్లో ఇరగదీసింది. అదే ఊపులో వచ్చింది కాబట్టి… కృష్ణగాడి వీరప్రేమగాధ మూవీకి కూడా ఓవర్సీస్ లో మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయి. అయితే గత సినిమా రేంజ్ లో ఈ సినిమాకూ వసూళ్లు రావాలంటే… కచ్చితంగా మేటర్ ఉండాల్సిందే. తెలుగులో క్లిక్కయిన ఆ సినిమా… ఓవర్సీస్ ప్రేక్షకులకు ఏ మేరకు నచ్చుతుందో తెలియాంటే… మరో 2రోజులు ఆగాల్సిందే.
Click on Image to Read:
bahubali
allu-arjun
summer-tollywood-movies

Click on Image for Samantha Stills

Samantha-FI

rajamouli-jr-ntr
devi
naga-shourya
parineeti-chopra
sunny-leone