Telugu Global
NEWS

ఉక్కుపాదం తప్పదు- జగ‌న్‌కు మంత్రుల ప్ర‌తిస‌వాల్

ఏపీ ప్ర‌భుత్వాన్ని కూలుస్తాన‌ని జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై మంత్రులు ప్ర‌త్తిపాటి పుల్లారావు, నారాయ‌ణ‌ తీవ్రంగా స్పందించారు. ప్ర‌భుత్వాన్ని కూలుస్తామ‌ని అన‌డం జ‌గ‌న్ అవివేకానికి నిద‌ర్శ‌న‌మ‌న్నారు. అభివృద్ధిని చూసి జ‌గ‌న్‌కు మ‌తి భ్ర‌మించింద‌న్నారు . ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసి ఎన్నిక‌ల‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం త‌మ‌కు లేదన్నారు. కావాలంటే, ద‌మ్ముంటే జ‌గ‌నే త‌న ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని మంత్రులు ప్ర‌తిస‌వాల్ చేశారు. తిరిగి తన ఎమ్మెల్యేలను గెలిపించుకుని మాట్లాడాలన్నారు. ప్రభుత్వాన్ని కూలదోస్తామన్న జ‌గ‌న్ రాజ‌ద్రోహానికి పాల్ప‌డ్డార‌ని […]

ఉక్కుపాదం తప్పదు- జగ‌న్‌కు మంత్రుల ప్ర‌తిస‌వాల్
X

ఏపీ ప్ర‌భుత్వాన్ని కూలుస్తాన‌ని జ‌గ‌న్ చేసిన వ్యాఖ్య‌ల‌పై మంత్రులు ప్ర‌త్తిపాటి పుల్లారావు, నారాయ‌ణ‌ తీవ్రంగా స్పందించారు. ప్ర‌భుత్వాన్ని కూలుస్తామ‌ని అన‌డం జ‌గ‌న్ అవివేకానికి నిద‌ర్శ‌న‌మ‌న్నారు. అభివృద్ధిని చూసి జ‌గ‌న్‌కు మ‌తి భ్ర‌మించింద‌న్నారు . ప్ర‌భుత్వాన్ని ర‌ద్దు చేసి ఎన్నిక‌ల‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం త‌మ‌కు లేదన్నారు. కావాలంటే, ద‌మ్ముంటే జ‌గ‌నే త‌న ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌ని మంత్రులు ప్ర‌తిస‌వాల్ చేశారు. తిరిగి తన ఎమ్మెల్యేలను గెలిపించుకుని మాట్లాడాలన్నారు.

ప్రభుత్వాన్ని కూలదోస్తామన్న జ‌గ‌న్ రాజ‌ద్రోహానికి పాల్ప‌డ్డార‌ని మంత్రి దేవినేని ఉమ తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. కుట్రపూరిత చర్యలను ఉక్కుపాదంతో అణచివేస్తామని ఉమ హెచ్చ‌రించారు. జ‌గ‌న్‌కు జైలు భ‌యం ప‌ట్టుకుంద‌ని టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి విమ‌ర్శించారు. గత ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా జగన్ మాత్రం స‌వాల్ చేయ‌డం మానుకోవ‌డం లేద‌ని ఎద్దేవా చేశారు. 2019 నాటికి జగన్‌ జైలులో ఉంటాడా? లేదా? అనేది జ్యోతిష్కుడిని అడిగి తెలుసుకోవాలని సోమిరెడ్డి సూచించారు.

Click on Image to Read:

kodali-nani

bhuma-nagireddy

kotla

chandrababu-elefad

payyavula-keshav

revanth

rtc-elections-in-andhra-pra

ramasubba-reddy

YS-Jagan-vishaka-sarada-pee

cbn-lokesh-2

85226c69-a90f-4fc1-9f68-263aa518924b

patti-devineni-ysrcp

jagan

adhi-keshavareddy

chandrababu-naidu

tdp-bjp1

cm-ramesh-prasad-reddy

First Published:  18 Feb 2016 7:47 AM GMT
Next Story