Telugu Global
Cinema & Entertainment

ఆ ఇద్దరి మ‌ధ్య చిచ్చుపెట్టింది ఆమేనా!

క్రిష్, వ‌రుణ్‌తేజ్‌ల క‌ల‌యిక‌తో మ‌ళ్లీ ఒక విభిన్న‌మైన చిత్రం వ‌స్తుంద‌ని ఎదురుచూసిన‌వారికి రాయ‌బారి వాయిదా ప‌డింద‌నే విష‌యం నిరాశ‌ని క‌లిగించింది.  క్రిష్, బాల‌కృష్ణ వందో చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాల్సి ఉండ‌టం, రాయ‌బారి షూటింగ్‌కి అనుమ‌తులు పొందాల్సి ఉండ‌డ‌మే ఆ వాయిదాకి కార‌ణాల‌ని ఒక టాక్ వినిపిస్తుండ‌గా, కంచె హీరోయిన్ ప్ర‌జ్ఞా జైస్వాలే అస‌లు కార‌ణం అనే పుకారుకూడా టాలివుడ్‌లో షికారు చేస్తోంది. రాయ‌బారిలో కూడా ప్ర‌జ్ఞా జైస్వాల్‌నే హీరోయిన్‌గా తీసుకోవాల‌ని క్రిష్ భావిస్తుండ‌గా, వ‌రుణ్‌తేజ్ అత‌ని స‌న్నిహితులు […]

ఆ ఇద్దరి మ‌ధ్య చిచ్చుపెట్టింది ఆమేనా!
X

క్రిష్, వ‌రుణ్‌తేజ్‌ల క‌ల‌యిక‌తో మ‌ళ్లీ ఒక విభిన్న‌మైన చిత్రం వ‌స్తుంద‌ని ఎదురుచూసిన‌వారికి రాయ‌బారి వాయిదా ప‌డింద‌నే విష‌యం నిరాశ‌ని క‌లిగించింది. క్రిష్, బాల‌కృష్ణ వందో చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాల్సి ఉండ‌టం, రాయ‌బారి షూటింగ్‌కి అనుమ‌తులు పొందాల్సి ఉండ‌డ‌మే ఆ వాయిదాకి కార‌ణాల‌ని ఒక టాక్ వినిపిస్తుండ‌గా, కంచె హీరోయిన్ ప్ర‌జ్ఞా జైస్వాలే అస‌లు కార‌ణం అనే పుకారుకూడా టాలివుడ్‌లో షికారు చేస్తోంది. రాయ‌బారిలో కూడా ప్ర‌జ్ఞా జైస్వాల్‌నే హీరోయిన్‌గా తీసుకోవాల‌ని క్రిష్ భావిస్తుండ‌గా, వ‌రుణ్‌తేజ్ అత‌ని స‌న్నిహితులు అందుకు సుముఖంగా లేర‌ట‌. దీనిపై చ‌ర్చ‌లను ముందుకు తీసుకువెళ్ల‌డానికి ఇద్ద‌రూ ప్ర‌య‌త్నించ‌డం లేద‌ని, ఈ ప్రాజెక్టు స‌మీప భ‌విష్య‌త్తులో ప‌ట్టాలెక్కే అవ‌కాశం లేద‌ని విన‌బ‌డుతున్న స‌మాచారం. వ‌రుణ్, వెంకీ అట్లూరి ద‌ర్శ‌కత్వంలో దిల్‌రాజ్ నిర్మించ‌బోతున్న‌ సినిమాకు సైన్ చేసిన‌ట్టుగా తెలుస్తోంది.

Click on Image to Read

Suraj-Pancholi

dilraju

virat

srija-wedding

First Published:  18 Feb 2016 2:55 AM GMT
Next Story