Telugu Global
National

ఉచిత భోజ‌నం...కొన్ని క‌ప్పుల కాఫీ...త‌రువాత బెయిలు!

బిజెపి ఎమ్మెల్యే ఒపి శ‌ర్మ అరెస్టు, పోలీసులు ఆయ‌న‌కు చేసిన మ‌ర్యాద‌ల‌పై ఆమ్ఆద్మీ పార్టీ వ్యంగ్యోక్తులు, ఛ‌లోక్తుల‌తో విరుచుకుప‌డింది. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు  క‌న్హ‌య్య కుమార్‌ని న్యూఢిల్లీలోని ప‌టియాలా  కోర్టులో ప్ర‌వేశ‌పెట్టిన‌పుడు బిజెపి  ఎమ్మెల్యే ఒపి శ‌ర్మ విద్యార్థుల‌పై దాడిచేయ‌డం, ఆ దృశ్యాలు మీడియాలో ప్ర‌ముఖంగా క‌నిపించ‌డం తెలిసిందే. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఒపి శ‌ర్మని అరెస్టు చేయాల‌ని డిమాండ్ చేశారు. బిజెపి నాయ‌కుల‌కు హ‌త్య, రేప్‌, కొట్ట‌డం ఇవేమీ నేరాలుగా […]

ఉచిత భోజ‌నం...కొన్ని క‌ప్పుల కాఫీ...త‌రువాత బెయిలు!
X

op-sharma_650x400_71455682166బిజెపి ఎమ్మెల్యే ఒపి శ‌ర్మ అరెస్టు, పోలీసులు ఆయ‌న‌కు చేసిన మ‌ర్యాద‌ల‌పై ఆమ్ఆద్మీ పార్టీ వ్యంగ్యోక్తులు, ఛ‌లోక్తుల‌తో విరుచుకుప‌డింది. జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు క‌న్హ‌య్య కుమార్‌ని న్యూఢిల్లీలోని ప‌టియాలా కోర్టులో ప్ర‌వేశ‌పెట్టిన‌పుడు బిజెపి ఎమ్మెల్యే ఒపి శ‌ర్మ విద్యార్థుల‌పై దాడిచేయ‌డం, ఆ దృశ్యాలు మీడియాలో ప్ర‌ముఖంగా క‌నిపించ‌డం తెలిసిందే. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఒపి శ‌ర్మని అరెస్టు చేయాల‌ని డిమాండ్ చేశారు. బిజెపి నాయ‌కుల‌కు హ‌త్య, రేప్‌, కొట్ట‌డం ఇవేమీ నేరాలుగా అనిపించ‌డం లేదంటూ ట్వీట్ చేశారు.

ఎట్ట‌కేల‌కు పోలీసులు ఓపి శ‌ర్మ‌ని సంఘ‌ట‌న జ‌రిగిన మూడురోజుల‌కు గురువారం అరెస్టు చేశారు. త‌న‌ని పోలీసులు ఎనిమిది గంట‌ల పాటు ఇంట‌రాగేట్ చేశార‌ని శ‌ర్మ‌ చెప్పుకున్నారు. అయితే ఒక వార్తాప‌త్రిక క‌థ‌నం ప్రకారం శ‌ర్మ‌కు పోలీసులు శాకాహార భోజ‌నం తెప్పించారు, అరెస్టుకు ముందే కొన్ని క‌ప్పుల కాఫీలూ తెప్పించారు. అరెస్టు అయిన వెంట‌నే నిముషాల్లోనే బెయిల్ ఇచ్చార‌ని తెలుస్తోంది. దీనిపై ఢిల్లీ ఉప‌ముఖ్య‌మంత్రి మ‌నీషి సిసోడియా స్పందిస్తూ, సిపి రెస్టారెంట్ నుండి ఉచిత భోజనం, అరెస్టుకు ముందే కొన్ని క‌ప్పుల కాఫీ, అరెస్టు అయిన పావుగంట‌లోనే విడుద‌ల‌…వివిఐపి….. అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.

సోమ‌వారం నాడు జ‌రిగిన గొడ‌వ‌లో లెఫ్ట్ నాయ‌కుడు అమీఖ్ జామై నేల‌మీద ప‌డి ఉండ‌టం, శ‌ర్మ ఆయ‌న‌పై దాడిచేయ‌డం స్ప‌ష్టంగా క‌న‌బ‌డుతుంది. అయితే త‌న‌పై దాడి చేయ‌డం వ‌ల్ల‌నే తిరిగి తాను అలా ప్ర‌వ‌ర్తించాల్సివ‌చ్చింద‌ని, త‌న‌ను, దేశాన్ని ర‌క్షించుకునేందుకే అలా చేశాన‌ని శ‌ర్మ అన్నారు. టెర్రిరిస్ట్ అఫ్జ‌ల్ గురు ఉరిశిక్ష‌కు గురై సంవ‌త్స‌రం ముగిసిన సంద‌ర్భంగా ఈ నెల తొమ్మిదిన జెఎన్‌యులో, భార‌త్‌కు వ్య‌తిరేకంగా స్లోగ‌న్లు ఇచ్చార‌నే ఆరోప‌ణ‌ల‌తో రాజ‌ద్రోహం నేరంకింద క‌న్హ‌య్య కుమార్‌ని అరెస్టు చేసిన సంగ‌తి తెలిసిందే.

First Published:  19 Feb 2016 4:02 AM GMT
Next Story