Telugu Global
National

బుల్లెట్ ట్రైన్‌....ఇప్ప‌ట్లో లేన‌ట్టేనా!

మ‌న‌దేశంలో బుల్లెట్‌ట్రైన్‌ని  తేవాల‌నే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌ప్ప‌టినుండి, వాటిపై  మీడియా అనేక క‌థ‌నాల‌ను వెలుగులోకి తెచ్చింది. వాటి వేగం, అందం, ఆదా అయ్యే కాలం ఇలాంటి విష‌యాలు ఇప్ప‌టికే జనంలోకి చాలా వెళ్లిపోయాయి. గ‌త ఏడాది డిసెంబ‌రులోనే  ముంబై అహ్మ‌దాబాద్ రూట్‌లో బుల్లెట్ రైలుని తెచ్చే ప్ర‌య‌త్నంలో భాగంగా మ‌న ప్ర‌భుత్వం జ‌పాన్‌తో ఒక ఒప్పందం కూడా కుదుర్చుకుంది. రూ. 98 వేల కోట్లు ఈ ప్రాజెక్టుకి  ఖ‌ర్చువుతుంది. ఇందుకోసం జపాన్ ఒక ట్రిలియన్ యెన్‌లు (రూ. 54వేల […]

బుల్లెట్ ట్రైన్‌....ఇప్ప‌ట్లో లేన‌ట్టేనా!
X

మ‌న‌దేశంలో బుల్లెట్‌ట్రైన్‌ని తేవాల‌నే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌ప్ప‌టినుండి, వాటిపై మీడియా అనేక క‌థ‌నాల‌ను వెలుగులోకి తెచ్చింది. వాటి వేగం, అందం, ఆదా అయ్యే కాలం ఇలాంటి విష‌యాలు ఇప్ప‌టికే జనంలోకి చాలా వెళ్లిపోయాయి. గ‌త ఏడాది డిసెంబ‌రులోనే ముంబై అహ్మ‌దాబాద్ రూట్‌లో బుల్లెట్ రైలుని తెచ్చే ప్ర‌య‌త్నంలో భాగంగా మ‌న ప్ర‌భుత్వం జ‌పాన్‌తో ఒక ఒప్పందం కూడా కుదుర్చుకుంది.

రూ. 98 వేల కోట్లు ఈ ప్రాజెక్టుకి ఖ‌ర్చువుతుంది. ఇందుకోసం జపాన్ ఒక ట్రిలియన్ యెన్‌లు (రూ. 54వేల కోట్లు) రుణంగా ఇవ్వాల‌ని కూడా ఒప్పందాలు జ‌రిగిపోయాయి. అయితే ఇప్పుడు తాజాగా ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఒడిదుడుకులు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేష‌న్‌కి మేనేజింగ్ డైర‌క్ట‌ర్‌గా ప‌నిచేసి, మెట్రోమ్యాన్‌గా కీర్తి గ‌డించిన డాక్ట‌ర్ శ్రీధ‌ర‌న్ ఈ సందేహాలు లేవ‌నెత్తారు.

బుల్లెట్ ట్రైన్ ట్రాక్ నిర్మాణం కోసం చాలా పెద్ద‌మొత్తంలో భూమిని సేక‌రించాల్సి రావ‌డం, ప్ర‌జ‌లు, ప‌శువుల మంద‌లు తిరిగేందుకు వీలుగా అండ‌ర్‌పాస్ నిర్మాణాల అవ‌సరం, ట్రైన్‌కోసం ప్ర‌త్యేక‌మైన కారిడార్ నిర్మాణం వీట‌న్నింటికీ క‌లిపి అనుకున్న దానిక‌న్నా ప‌దివేల కోట్లు అద‌నంగా ఖ‌ర్చ‌య్యేలా ఉంది. అందుకే ఇప్పుడు మ‌నం బులెట్ ట్రైన్‌ని ప‌ట్టాలెక్కించ‌లేమ‌ని, మ‌రో ఎనిమిది నుండి ప‌ది సంవ‌త్సరాల కాలం ఇందుకు ప‌ట్ట‌వ‌చ్చ‌ని శ్రీధ‌ర‌న్ అంటున్నారు. బుల్లెట్ ట్రైన్‌కోసం ప్ర‌య‌త్నించ‌డం కంటే ఇప్పుడు ఉన్న రైల్వే వ్య‌వ‌స్థ‌లో స‌దుపాయాలు, వ‌స‌తులు, వేగం లాంటివి అభివృద్ధి ప‌ర‌చుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న అన్నారు.

First Published:  18 Feb 2016 11:07 PM GMT
Next Story