బాబు డాబుకు ప‌రాకాష్ట

అమరావతి అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తారో లేదో గానీ.. చంద్రబాబు మాత్రం తన సౌకర్యాలను ఇంటర్నేషనల్ రేంజ్‌లోనే చేసుకుంటున్నారు. ఇప్ప‌టికే హైద‌రాబాద్, విజ‌య‌వాడ‌లోని త‌న చాంబ‌ర్ల మ‌రమ్మ‌తుల‌కు కోట్లు ఖ‌ర్చు చేసిన చంద్ర‌బాబు ఇప్పుడో మ‌రో దుబారాకు తెర‌లేపారు. వెల‌గ‌పూడి వ‌ద్ద నిర్మిస్తున్న తాత్కాలిక స‌చివాల‌యంలోనూ త‌న కార్యాల‌యానికి హంగుల కొర‌త లేకుండా చూసుకుంటున్నారు.

తాత్కాలిక భ‌వనం అంటూనే దానిపై ఏకంగా  రూప్ టాప్  హెలిపాడ్ నిర్మిస్తున్నారు. అంటే సినిమాల్లో చూపించిన‌ట్టు భ‌వ‌నంపైనే చంద్ర‌బాబు ల్యాండ్ అవుతారు. అక్క‌డి నుంచి నేరుగా లిఫ్ట్ ద్వారా త‌న చాంబ‌ర్‌లోకి వెళ్లిపోతారు. ప‌ని ముగించుకున్న త‌ర్వాత తిరిగి భ‌వ‌నంపైకి వెళ్లి హెలికాప్ట‌ర్ ఎక్కి నేరుగా గ‌న్న‌వ‌రం ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అవుతారు. అక్క‌డి నుంచి విమానం ఎక్కి హైద‌రాబాద్‌, ఇత‌ర ప్రాంతాల‌కు వెళ్తారు. రూప్ టాప్ హెలిపాడ్ నిర్మించే ప‌నిని ఎల్ అండ్ టీ కంపెనీ చూస్తోంది.రూప్ టాప్ హెలిపాడ్  భవనాన్ని ఆశామాశీగా నిర్మించకూడదు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించాల్సి వుంటుంది. ఇందుకు నిధులు కూడా భారిగా ఖర్చుపెట్టాల్సి ఉంటుంది.

ప్ర‌స్తుతం నిర్మిస్తున్న స‌చివాలయం తాత్కాక‌మైన‌ద‌ని ప్ర‌భుత్వ‌మే చెబుతోంది. కేవ‌లం రెండు మూడేళ్లు మాత్ర‌మే ఆ భ‌వనాల‌ను వాడుతామ‌ని చెబుతోంది. అలాంట‌ప్పుడు తాత్కాలిక నిర్మాణంపై ప్ర‌జాధ‌నం వృధా చేసేలా హెలిపాడ్ అవ‌స‌ర‌మా అని విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మ‌రో విష‌యం ఏమిటంటే దేశంలో మ‌రే ముఖ్య‌మంత్రి కార్యాల‌యంపైనా ఇలాంటి రూప్ టాప్ హెలిపాడ్ లేదు. డబ్బులు లేవంటూనే ఈ రేంజ్ లో దుబారా చేస్తే కేంద్రమైనా, మరొకరైనా ఎలా నమ్ముతారో బాబుకే తెలియాలి.

Click on Image to Read:

sakshi-chandrababu

sakshi-bhuma

kodali-nani

bhuma-nagireddy

kotla

payyavula-keshav

revanth

rtc-elections-in-andhra-pra

jagan-tdp

ramasubba-reddy

YS-Jagan-vishaka-sarada-pee

cbn-lokesh-2

85226c69-a90f-4fc1-9f68-263aa518924b
patti-devineni-ysrcp

jagan

adhi-keshavareddy

chandrababu-naidu

tdp-bjp1

cm-ramesh-prasad-reddy