ముగ్గురి రాయబారం ఫలించినట్టేనా?

భూమానాగిరెడ్డి పార్టీ వీడుతున్న‌ట్టు జ‌రుగుతున్న ప్ర‌చారం నేప‌థ్యంలో వైసీపీ కీల‌క నేత‌లు వైవీ సుబ్బారెడ్డి, విజ‌య‌సాయిరెడ్డి, స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి ఆయ‌నతో చ‌ర్చ‌లు జ‌రిపారు. సుధీర్ఘంగా చ‌ర్చించారు. అనంత‌రం ముగ్గురు నేత‌లు మీడియాతో మాట్లాడారు. భూమా పార్టీని వీడివెళ్ల‌డం లేద‌ని సుబ్బారెడ్డి, సాయిరెడ్డి, స‌జ్జ‌ల చెప్పారు. మీడియాలో వ‌స్తున్న వార్త‌ల నేప‌థ్యంలో తాము భూమాను క‌లిశామ‌న్నారు. పార్టీ మారుతున్న‌ట్టు మీడియాలో ఎందుకు క‌థ‌నాలు వ‌స్తున్నాయో త‌న‌కు అర్థం కావ‌డం లేద‌ని భూమా చెప్పార‌న్నారు.

ప్ర‌స్తుతం భూమానాగిరెడ్డి కుమార్తె పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉన్నార‌ని ముగ్గురు నేత‌లు చెప్పారు. వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ వీడుతున్న‌ట్టు వ‌స్తున్న క‌థ‌నాలు కొన్ని మీడియా సంస్థ‌ల సృష్టేన‌న్నారు. చంద్ర‌బాబు మైండ్ గేమ్ ఆడుతున్నార‌ని మండిప‌డ్డారు. రెండేళ్లుగా వైసీపీ ఎమ్మెల్యేలపై  మీడియా ద్వారా  టీడీపీ ఇలాంటి తప్పుడు కథనాలు ప్రసారం చేయిస్తూనే ఉందన్నారు.

సాధార‌ణంగా చ‌ర్చ‌లు విఫ‌ల‌మై ఉంటే సుబ్బారెడ్డి, సాయిరెడ్డి, స‌జ్జ‌ల మీడియాతో మాట్లాడ‌కుండా వెళ్లే వార‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. కానీ భూమాతో చ‌ర్చ‌ల అనంత‌రం వారు మీడియా ముందుకు వ‌చ్చి మాట్లాడ‌డం బ‌ట్టి చూస్తుంటే భూమా ఎపిసోడ్‌కు ఫుల్ స్టాప్ ప‌డిందా అన్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. అయితే భూమానాగిరెడ్డి నేరుగా స్పందించే వ‌ర‌కు ఒక నిర్ధార‌ణ‌కు రావ‌డం కూడా క‌ష్ట‌మే.

Click on Image to Read

sakshi-chandrababu

2bd159d6-8c6a-4b0e-93f1-7540517de4d4

sakshi-bhuma

lokesh-nara

payyavula-keshav

sv-mohan-reddy

krishnashtami-movie-review

kodali-nani

chandrababu-elefad