Telugu Global
NEWS

"సాక్షి"తో ఏం గానీ... వారితో అప్పులు క‌ట్టించండి బాబు!

బాబు మీడియా ఫ్రెండ్లీ అని చెబుతుంటారు. కానీ ఆయ‌న త‌న‌కు డ‌బ్బా కొట్టే మీడియాకు మాత్ర‌మే ఫ్రెండ్లీ అనిపిస్తోంది. విజ‌య‌వాడ‌లో చంద్రబాబు ప్ర‌క‌ట‌న చూస్తే అలాగే ఉంది. ఏపీలో 16 చాన‌ళ్లు ఉన్నాయి. కానీ వాటిలో మేజారిటీ చాన‌ళ్లు అవ‌స‌రానికి ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తుగా డ‌బ్బా వాయించే డ‌బ్బాలే. కొన్ని త‌ట‌స్ట చాన‌ళ్లు ఉన్నాయి. కానీ అనవ‌స‌రంగా ప్ర‌తిసారి బాబుతో గొడ‌వెందుక‌ని స‌ర్దుకుపోతుంటాయి. కానీ మిగిలింది మాత్ర‌మే సాక్షి ప‌త్రిక‌, టీవీనే. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షానికి చెందినది కావ‌డంతో చంద్ర‌బాబు […]

సాక్షితో ఏం గానీ... వారితో అప్పులు క‌ట్టించండి బాబు!
X

బాబు మీడియా ఫ్రెండ్లీ అని చెబుతుంటారు. కానీ ఆయ‌న త‌న‌కు డ‌బ్బా కొట్టే మీడియాకు మాత్ర‌మే ఫ్రెండ్లీ అనిపిస్తోంది. విజ‌య‌వాడ‌లో చంద్రబాబు ప్ర‌క‌ట‌న చూస్తే అలాగే ఉంది. ఏపీలో 16 చాన‌ళ్లు ఉన్నాయి. కానీ వాటిలో మేజారిటీ చాన‌ళ్లు అవ‌స‌రానికి ప్ర‌భుత్వానికి మ‌ద్ద‌తుగా డ‌బ్బా వాయించే డ‌బ్బాలే. కొన్ని త‌ట‌స్ట చాన‌ళ్లు ఉన్నాయి. కానీ అనవ‌స‌రంగా ప్ర‌తిసారి బాబుతో గొడ‌వెందుక‌ని స‌ర్దుకుపోతుంటాయి. కానీ మిగిలింది మాత్ర‌మే సాక్షి ప‌త్రిక‌, టీవీనే. ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షానికి చెందినది కావ‌డంతో చంద్ర‌బాబు త‌ప్పుల‌ను ఎత్తిచూపుతూ వెంటాడుతూనే ఉంది. అందుకే కాబోలు చంద్ర‌బాబుకు సాక్షిపై తెగ కోప‌మొచ్చింది. విలేక‌ర్ల స‌మావేశంలోనే సాక్షిని భ‌య‌పెట్టారు. పెద్ద మీడియా సంస్థ అయిన సాక్షినే భ‌య‌పెడుతున్నా .. ఇక మీరెంత అని చిన్న‌పాటి టీవీ చాన‌ళ్ల‌ను కూడా ప‌రోక్షంగా భ‌య‌పెట్టారు బాబు.

అటాచ్ అయిన ప‌త్రిక త‌న‌కు వ్య‌తిరేకంగా క‌థ‌నాలు రాయ‌డం ఏమిట‌ని బాబు ప్ర‌శ్నించారు. అటాచ్ అయిన ప‌త్రిక అంటే అది ప్ర‌భుత్వ ప‌త్రిక అని డిక్లేర్ చేశారు. ప్ర‌భుత్వ ప‌త్రికై ఉండి ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా క‌థ‌నాలు రాయ‌డం ఏమిట‌ని ధ‌ర్మ‌సందేహం వ్య‌క్తం చేశారు. అవినీతి ఆస్తుల‌ను స్వాధీనం చేసుకుంటామ‌ని మేనిఫెస్టోలో కూడా చెప్పామ‌ని గుర్తు చేశారు. ప్ర‌స్తుతం అటాచ్ ఆస్తుల స్వాధీనం చేసుకునే బిల్లు ఢిల్లీలో ఉంద‌ని అది రాగానే సాక్షి ఆస్తుల‌ను స్వాధీనం చేసుకుంటామ‌ని చెప్పారు.

నాణానికి రెండో వైపు మాత్రం సాక్షి వ‌చ్చాకే జ‌నానికి తెలుస్తోంది. జ‌గ‌న్ చేసే త‌ప్పులు చూపెట్ట‌డానికి ఎలాగు టీడీపీ అనుకూల‌మైన చాలా మీడియా సంస్థ‌లున్నాయి. ఇక టీడీపీ చేసే త‌ప్పులు కూడా జ‌నానికి తెలియాలి క‌దా!. అప్పుడు సాక్షిలాంటి మీడియా అవ‌స‌ర‌మే కదా!. సాక్షిని మూసేస్తే గ‌తంలో తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్న‌కాలంలోలాగా జ‌నం క‌ళ్ల‌కు అనుకూల మీడియా ద్వారా గంత‌లు క‌ట్టి కబ‌డ్డీ ఆడుకోవ‌చ్చ‌న్న‌ది బాబు ఆలోచ‌న కాబోలు. అయినా…

మీడియా సంస్థ‌ల‌తో ఎందుకు గానీ మీ కేంద్ర‌మంత్రి సుజ‌నా చౌద‌రి, మీ ఎంపీ రాయ‌పాటి, మీ మిత్రుడు కావూరి లాంటి వారు వేల కోట్ల‌కు పంగ‌నామాలు పెట్టి బ్యాంకుల‌ను దివాలా తీయిస్తున్నారు. ముందు వీలైతే వారి చేత అప్పులు క‌ట్టించ‌డ‌మో.. లేక వారి ఆస్తులు జ‌ప్తు చేయించ‌డ‌మే చేస్తే మీ మేనిఫెస్టోకు రైతు, డ్వాక్రా రుణ‌మాఫీ దెబ్బ‌కు పోయిన ప‌విత్ర‌త కొంచెమైన వ‌స్తుందేమో!. బ్యాంకుల సొమ్ము కూడా ప్రజల సొమ్మే కదా!. ఆ సొమ్మును ఎగ్గొట్టే వారిని ఇంకా కఠినంగా పనిష్ చేయాలి కదా!. ప్ర‌భుత్వంలోని లోటుపాట్ల‌ను బ‌య‌ట‌పెట్టే మీడియాను బెదిరించ‌డం స‌రికాదు. ఈ రాష్ట్రం అధికార పార్టీ వారిదే కాదు… ప్ర‌తిప‌క్షాల‌ది, మీడియాది కూడా !. ఈరోజు సాక్షిని బెదిరిస్తారు రేపు మాట వినకుంటే మరో చానల్ ను ఇలానే బ్లాక్ మెయిల్ చేస్తారు కాబోలు అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Click on Image to Read

kadapa-ycp

bhuma-nari-reddy-jagan

bhuma-nagi-reddy

2bd159d6-8c6a-4b0e-93f1-7540517de4d4

sakshi-bhuma

lokesh-nara

payyavula-keshav

sv-mohan-reddy

krishnashtami-movie-review

kodali-nani

chandrababu-elefad

First Published:  20 Feb 2016 10:37 AM GMT
Next Story