Telugu Global
Cinema & Entertainment

3 వారాల్లో.... 3 పాటలు... పవన్ నయా టార్గెట్

అసలే పవన్ సినిమాలు నత్తనడకన సాగుతాయి. టార్గెట్లు పెట్టుకుంటే పనులు జరగవు. మూడ్ మీదే షూటింగ్ ఆధారపడి ఉంటుంది. అలాంటి పవన్ సినిమాకు టార్గెట్ ఫిక్స్ అయింది. 3 వారాల్లో కచ్చితంగా 3 పాటలు కంప్లీట్ చేయాల్సిన అగత్యం ఏర్పడింది. అందుకే తనకు తానే ఈ టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాడు పవన్. ఏప్రిల్ 8న ఈ సినిమాను విడుదల చేయాలని డిసైడ్ అయ్యాడు. రిలీజ్ డేట్ చెప్పి బిజినెస్ కూడా పూర్తిచేశారు. అయితే ఇంకా 3 పాటలు […]

3 వారాల్లో.... 3 పాటలు... పవన్ నయా టార్గెట్
X
అసలే పవన్ సినిమాలు నత్తనడకన సాగుతాయి. టార్గెట్లు పెట్టుకుంటే పనులు జరగవు. మూడ్ మీదే షూటింగ్ ఆధారపడి ఉంటుంది. అలాంటి పవన్ సినిమాకు టార్గెట్ ఫిక్స్ అయింది. 3 వారాల్లో కచ్చితంగా 3 పాటలు కంప్లీట్ చేయాల్సిన అగత్యం ఏర్పడింది. అందుకే తనకు తానే ఈ టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాడు పవన్. ఏప్రిల్ 8న ఈ సినిమాను విడుదల చేయాలని డిసైడ్ అయ్యాడు. రిలీజ్ డేట్ చెప్పి బిజినెస్ కూడా పూర్తిచేశారు. అయితే ఇంకా 3 పాటలు బ్యాలెన్స్ ఉండనే ఉన్నాయి. ఈ 3 పాటల్ని 3 వారాల్లో ముగించి…. మార్చి రెండో వారంలో ఆడియో రిలీజ్ చేసి… ఏప్రిల్ 8న సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలనేది ప్లాన్. ఈ 3 పాటల్లో ఒక పాటను హైదరాబాద్ లోనే షూట్ చేసి… మిగతా రెండు పాటల కోసం యూరోప్ వెళ్లాలని పవన్ అనుకుంటున్నాడు. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. మరోవైపు దర్శకుడు బాబి… సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఎడిటింగ్, రీ-రికార్డింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు.ఇవన్నీ ఓ కొలిక్కి వచ్చిన వెంటనే…. సర్దార్ గబ్బర్ సింగ్ టీం… యూరోప్ వెళ్తుంది.
First Published:  20 Feb 2016 12:31 AM GMT
Next Story