యంగ్ మాన్- ఓల్డ్ యాటిట్యూడ్

కొత్త త‌రం రాజ‌కీయాల్లోకి రావాల‌ని చాలా మంది చెబుతూ ఉంటారు. అలా ఎందుకంటారంటే!. కొత్త త‌రం ఆలోచ‌న‌లు ప‌విత్రంగా ఉంటాయ‌ని. దిగ‌జారిన రాజ‌కీయాల‌కు చ‌ర‌మ‌గీతం పాడి స్ప‌చ్చ‌మైన రాజ్యాన్ని నిర్మిస్తార‌ని. జ‌నాన్ని న‌వ‌యుగం వైపు న‌డిపిస్తార‌ని. ఈ విష‌యంలో మిగిలిన నేత‌ల సంగ‌తేమో గానీ చంద్ర‌బాబు త‌న‌యుడు నారా లోకేష్ మాత్రం ఇందుకు భిన్నంగానే ప్రయాణం చేస్తున్నట్టుగా ఉంది. యంగ్ మాన్‌గా జ‌నంలోకి దూసుకెళ్లి జ‌నం నుంచి నాయ‌కుడిగా ఎద‌గాల్సింది పోయి… తెర వెనుక పంచాయ‌తీల‌కు ఎక్కువ ప్రాధాన్య‌త ఇస్తున్న‌ట్టుగా ఉంది.  గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో నేరుగా దిగి చేతులు కాల్చుకున్న లోకేష్‌… స్ట్రైట్ పాలిటిక్స్‌తో ప‌నికాద‌నుకున్నారో ఏమో గానీ రాజ‌కీయ విలువ‌ను పాతాళానికి తీసుకెళ్లేందుకు త‌మ వంతు సాయం చేస్తున్నారు.

ఏపీలో ప్ర‌తిప‌క్షం నుంచి ఎమ్మెల్యేల‌ను ప్ర‌లోభ‌పెట్టే ప‌ర్వంలో లోకేష్ కీల‌క పాత్ర పోషిస్తుండ‌డం ఆశ్చ‌ర్య‌క‌ర‌మే. గ‌తంలో ఇలాంటి ఫిరాయింపు రాజ‌కీయాలు చాలానే జ‌రిగి ఉండ‌వ‌చ్చు. కానీ యువ‌నాయ‌కుడిగా వాటికి చ‌ర‌మ‌గీతం పాడి జ‌నం మ‌న‌సు గెల‌వాల్సింది పోయి ఇలా చేయ‌డం కొత్త జ‌న‌రేషన్ వ‌ల్ల స్వ‌చ్చ‌మైన రాజ‌కీయాలు ఆశించే వారికి శ‌రాఘాత‌మే. పైగా క‌నీసం ఇప్ప‌టి వ‌ర‌కు లోకేష్ ఎమ్మెల్యేగా కూడా గెలిచి త‌న ప్ర‌జాబ‌లాన్ని నిరూపించుకోలేక‌పోయారు. ఇంకా రాజ‌కీయాల్లో పూర్తి స్థాయిలో ల్యాండ్ కూడా అవ‌లేదు. అప్పుడే ఇలాంటి తెర‌చాటు రాజ‌కీయాల‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌డం ద్వారా బ‌హుశా దేశంలోనే అతి చిన్న‌వ‌య‌సులోనే ముదురు రాజ‌కీయాలు చేస్తున్న వ్య‌క్తిగా ఆయ‌న పేరు తెచ్చుకోవ‌చ్చు.

ఇక్క‌డ మ‌రో విష‌యం ఏమిటంటే ఎమ్మెల్యేల‌ను ఆక‌ర్శించ‌డంలో లోకేష్ నిజంగానే చాక‌చ‌క్యంగా చ‌క్రం తిప్పుతున్నారా అంటే అది లేద‌న్న భావ‌న వ్య‌క్త‌మవుతోంది. తెలంగాణ‌లో టీడీపీ ఎమ్మెల్యేలు వ‌రుస పెట్టి టీఆర్ఎస్‌లో చేరిన‌ప్పుడు మాత్రం లోకేష్ ఏమీ చేయ‌లేక‌పోయారు. కనీసం ఒక‌రిద్ద‌రు ఎమ్మెల్యేల‌ను కూడా అడ్డుకోలేక‌పోయారు. ఏపీలో మాత్రం తండ్రి ముఖ్యమంత్రిగా ఉండ‌డంతో అధికార‌, ఆర్థిక వ‌న‌రుల‌ను వాడుకుంటూ ప‌క్క‌పార్టీ వాళ్ల‌ను గిల్లుతూ ముందుకెళ్తున్నారు. క‌నీసం పార్టీలో చేర్చుకుని ఎమ్మెల్యేల చేత రాజీనామా అయిన చేయించ‌గ‌లిగితే చంద్ర‌బాబు, లోకేష్‌లు స‌గ‌మైనా నిజాయితీ రాజ‌కీయాలు చేస్తున్న‌ట్టుగా అనుకోవ‌చ్చు. మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో న‌డుస్తున్నంత‌ స్థాయిలో చిల్ల‌ర రాజ‌కీయాలు  దేశంలో ఎక్క‌డా నడవడం  లేద‌న్న‌ది మాత్రం వాస్త‌వం.

Click on Image to Read

sakshi-bhuma

payyavula-keshav

sv-mohan-reddy

krishnashtami-movie-review

kodali-nani

chandrababu-elefad