జ‌గ‌న్ నిన్న‌టి వ్యాఖ్య‌ల‌పై మొన్న‌నే రియాక్ట్ అయిన బాబు !

వినేవాళ్లు వెర్రి వెధ‌వ‌లైతే చెప్పేది చంద్ర‌బాబు మీడియా అన్న‌ట్టుగా  క‌థ న‌డుస్తోంది.  బాబు చేసే త‌ప్పుల‌ను కూడా ప్ర‌తిప‌క్షం మెడ‌లో వేస్తోంది.  తాజాగా బాబుకు న‌మ్మిన‌బంటుగా ఉండే ఒక మీడియా సంస్థ కొత్త కోణమంటూ కుట్ర‌పూరిత వ్య‌వ‌హారాన్ని ప్ర‌చారం చేయ‌డం  మొద‌లుపెట్టింది. అదేంటే ఎమ్మెల్యేల ఫిరాయింపుల విష‌యంలో తెలంగాణ‌లోలాగా కాకుండా ఏపీలో నిజాయితీగా రాజ‌కీయాలు న‌డ‌పాల‌ని చంద్ర‌బాబు భావించార‌ట‌.  కానీ ఎప్పుడైతే జ‌గ‌న్  ప్ర‌భుత్వాన్ని ప‌డ‌గొడుతాన‌ని చెప్ప‌గానే ఇక నిజాయితీగా ఉంటే పనికాద‌న్న భావ‌న‌కు చంద్ర‌బాబు వ‌చ్చార‌ట‌. అందుకే వైసీపీ ఎమ్మెల్యేల‌ను పార్టీలోకి తీసుకునేందుకు  సిద్ధ‌మ‌య్యార‌న్న‌ది టీడీపీ అనుకూల మీడియా కొత్త కోణం. అయితే అస‌లు నిజ‌మేంటో ఒక సారి గ‌మ‌నిస్తే…

జ‌గ‌న్ గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన అనంత‌రం మీడియాతో మాట్లాడారు. అది జ‌రిగింది బుధ‌వారం. కానీ ముందురోజే అంటే మంగ‌ళ‌వార‌మే చంద్ర‌బాబు విజ‌య‌వాడ‌లో కేబినెట్ భేటీ నిర్వ‌హించారు. కేబినెట్ భేటీ అనంత‌రం వైసీపీ ఎమ్మెల్యేల‌ను ఎలా లాగాలి అన్న‌దానిపై చంద్ర‌బాబే స్వ‌యంగా త‌ర్ఫీదు ఇచ్చారు.  ఈ విష‌యం అన్ని ప‌త్రిక‌ల్లో వ‌చ్చింది. ప్ర‌స్తుతం నీతులు వ‌ల్లిస్తున్న టీడీపీ అనుకూల మీడియా కూడా ఆ వార్త‌ల‌ను ప్రముఖంగా ప్ర‌సారం చేసింది.

చంద్ర‌బాబు ఈ ఎత్తుగ‌డ వేసిన నేప‌థ్యంలో ఆ మ‌రుస‌టి రోజు గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసిన స‌మ‌యంలో మీడియా ప్ర‌తినిధులు జ‌గ‌న్‌ను ప్ర‌శ్నించారు.  టీడీపీ ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు తెర‌లేపుతోంది క‌దా ఏం చేయ‌బోతున్నార‌ని మీడియా ప్ర‌తినిధులు ప్ర‌శ్నించారు.  అందుకు ఆయ‌న టీడీపీ నుంచి 21 మంది  ఎమ్మెల్యేలు వ‌స్తే ప్ర‌భుత్వం కూలుతుంద‌ని స‌మాధానం చెప్పారు. అంటే వైసీపీ ఎమ్మెల్యేల‌ను లాగేందుకు చంద్ర‌బాబు కేబినెట్ రూమ్‌లోనే ప్లాన్ గీసి… ఆది మీడియాలో కూడా వ‌చ్చిన త‌ర్వాతే జ‌గ‌న్ స్పందించారు. కానీ టీడీపీ అనుకూల మీడియా మాత్రం చంద్ర‌బాబు నిజాయితీగా ఉండాల‌నుకున్నారు. కానీ జ‌గ‌నే రెచ్చ‌గొట్టారు. అందుకే చంద్ర‌బాబు పార్టీ ఫిరాయింపుల‌ను ప్రోత్స‌హించేందుకు సిద్ధ‌మ‌య్యారని సెంట్ రాసే ప‌ని చేస్తోంది. జ‌గ‌న్ బుధ‌వారం స్పందిస్తే దాని ఆధారంగానే చంద్ర‌బాబు రెచ్చిపోయి మంగ‌ళ‌వార‌మే మ‌న‌సు మార్చుకుని వైసీపీ ఎమ్మెల్యేల‌ను చేర్చుకునేందుకు సిద్ధ‌మ‌న్నారన్న మాట‌.  వాట్ ఏ లైన్.

Click on image to read:bhuma-nari-reddy-jagan

chadnrabad

sakshi-chandrababu

lokesh-nara

payyavula-keshav