Telugu Global
Others

ఇదీ స్త్రీల‌కు మ‌నమిచ్చే గౌర‌వం!

స్త్రీలు ఎంతో క‌ష్ట‌ప‌డి, శారీర‌క శ్ర‌మ‌తో కూడిన ఉద్యోగాల్లోనూ రాణిస్తున్నారు. కానీ త‌మ త‌ప్పు, లోపం లేక‌పోయినా వారు ఎక్క‌డో ఒక చోట నిర్ల‌క్ష్యం, అవ‌మానం, అస‌మాత‌ల‌కు గుర‌వుతూనే ఉన్నారు. అలాంటి  ఘ‌ట‌నే ఇది. రాజ‌స్థాన్‌లో ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో గార్డ్ పోస్ట్‌ల‌కు మ‌హిళ‌లు సైతం అప్ల‌యి చేసుకున్నారు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉంది కానీ మ‌హిళ‌ల‌కు ఫిజిక‌ల్ టెస్టులను మ‌గ అధికారులు, సంబంధిత మ‌గ ఉద్యోగులే నిర్వ‌హించారు. ఈ విష‌యం బ‌య‌ట‌కు పొక్క‌డంతో ఇప్పుడు రాజ‌స్థాన్ ప్ర‌భుత్వం ఈ సంఘ‌ట‌న‌పై విచార‌ణకు ఆదేశించింది. మొత్తం 250మంది […]

ఇదీ స్త్రీల‌కు మ‌నమిచ్చే గౌర‌వం!
X

స్త్రీలు ఎంతో క‌ష్ట‌ప‌డి, శారీర‌క శ్ర‌మ‌తో కూడిన ఉద్యోగాల్లోనూ రాణిస్తున్నారు. కానీ త‌మ త‌ప్పు, లోపం లేక‌పోయినా వారు ఎక్క‌డో ఒక చోట నిర్ల‌క్ష్యం, అవ‌మానం, అస‌మాత‌ల‌కు గుర‌వుతూనే ఉన్నారు. అలాంటి ఘ‌ట‌నే ఇది. రాజ‌స్థాన్‌లో ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్‌లో గార్డ్ పోస్ట్‌ల‌కు మ‌హిళ‌లు సైతం అప్ల‌యి చేసుకున్నారు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉంది కానీ మ‌హిళ‌ల‌కు ఫిజిక‌ల్ టెస్టులను మ‌గ అధికారులు, సంబంధిత మ‌గ ఉద్యోగులే నిర్వ‌హించారు. ఈ విష‌యం బ‌య‌ట‌కు పొక్క‌డంతో ఇప్పుడు రాజ‌స్థాన్ ప్ర‌భుత్వం

ఈ సంఘ‌ట‌న‌పై విచార‌ణకు ఆదేశించింది. మొత్తం 250మంది అభ్య‌ర్థుల్లో 18మంది మ‌హిళ‌లు ఉన్నారు. వీరంతా రిట‌న్ ప‌రీక్ష‌లు పాస‌యి, ఫిట్‌నెస్ ట‌స్ట్‌ల‌కు హాజ‌ర‌యిన సంద‌ర్భంలో ఈ సంఘ‌ట‌న జ‌రిగింది. మ‌హిళా వైద్యులు కూడా ఉన్న మెడిక‌ల్ బోర్డుని ఇందుకోసం ఫారెస్ట్ డిపార్ట్ మెంట్ నియామ‌కం చేసింది. కానీ ఒక మ‌గ‌ఫారెస్ట్ గార్డు మ‌హిళా అభ్య‌ర్థి ఛాతీ చుట్టూ టేప్‌తో కొల‌త‌లు తీసుకునే ఫొటో బ‌య‌ట‌కు రావ‌డంతో దీనిపై ఆందోళ‌న మొద‌లైంది. దాంతో ప్ర‌భుత్వం స్పందించింది. ఆ మ‌హిళ‌ల కొల‌త‌లు తీసుకున్న ఫారెస్టు గార్డుని స‌స్పెండ్ చేస్తూ అట‌వీ శాఖా మంత్రి ఉత్త‌ర్వులు జారీ చేశారు. మెడిక‌ల్ బోర్డులో ఉన్న మ‌హిళా వైద్యుల నిర్లక్ష్యంపై విచార‌ణ‌కు ఆదేశించారు.

భ‌విష్య‌త్తులో శారీర‌క కొల‌త‌లు తీసుకునే స‌మ‌యంలో వీడియో తీసే విధానం ప్ర‌వేశ‌పెట్టాల‌ని కూడా మంత్రి ఆదేశించారు. అస‌లు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో మ‌హిళా కానిస్టేబుళ్లను తీసుకునేట‌ప్పుడు బ‌రువు, ఎత్తు మాత్ర‌మే చూస్తామ‌ని ఇలా ఛాతీ కొల‌త‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని ఓ పోలీస్ అధికారి అన్నారు.

First Published:  21 Feb 2016 1:52 AM GMT
Next Story