Telugu Global
Cinema & Entertainment

ఆ రీమేక్ రజనీ చేయట్లేదు

ప్రస్తుతం రజనీకాంత్ రెండు సినిమాలు చేస్తున్నాడు. కబాలి సినిమా షూటింగ్ ను క్లయిమాక్స్ కు తీసుకొస్తూనే… రోబో 2.0 సినిమాను కూడా శరవేగంగా పరుగులుపెట్టిస్తున్నాడు. ఈ రెండు చాలవన్నట్టు రజనీకాంత్ మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ 3 రోజుల నుంచి తెగ ప్రచారం జరుగుతోంది. మలయాళంలో హిట్టయిన భాస్కర్-ది రాస్కెల్ సినిమాను రజనీకాంత్ రీమేక్ చేస్తారంటూ పుకార్లు వ్యాపించాయి. దీంతో స్వయంగా రజనీకాంత్ మేనేజర్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఆ సినిమా రీమేక్ లో […]

ఆ రీమేక్ రజనీ చేయట్లేదు
X
ప్రస్తుతం రజనీకాంత్ రెండు సినిమాలు చేస్తున్నాడు. కబాలి సినిమా షూటింగ్ ను క్లయిమాక్స్ కు తీసుకొస్తూనే… రోబో 2.0 సినిమాను కూడా శరవేగంగా పరుగులుపెట్టిస్తున్నాడు. ఈ రెండు చాలవన్నట్టు రజనీకాంత్ మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ 3 రోజుల నుంచి తెగ ప్రచారం జరుగుతోంది. మలయాళంలో హిట్టయిన భాస్కర్-ది రాస్కెల్ సినిమాను రజనీకాంత్ రీమేక్ చేస్తారంటూ పుకార్లు వ్యాపించాయి. దీంతో స్వయంగా రజనీకాంత్ మేనేజర్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఆ సినిమా రీమేక్ లో సూపర్ స్టార్ నటించడం లేదని స్పష్టంచేశారు. రోబో-2 సినిమా కంప్లీట్ అయ్యేసరికి కనీసం మరో ఏడాదైనా పడుతుందని… ఆ తర్వాతే నెక్ట్స్ సినిమా గురించి రజనీకాంత్ ఆలోచిస్తారని తెలిపారు. మలయాళంలో తను తెరకెక్కించిన భాస్కర్-ది రాస్కెల్ సినిమాను…. రజనీకాంత్ తో రీమేక్ చేస్తానని స్వయంగా ఆ సినిమా దర్శకుడు సిద్ధిఖి ప్రకటించాడు. కానీ ఇప్పట్లో ఆ ప్రాజెక్టు లేదని రజనీకాంత్ వైపు నుంచి స్పష్టత వచ్చేసింది. సో… ప్రస్తుతానికైతే సూపర్ స్టార్ ఎలాంటి రీమేక్ ప్రాజెక్టు చేయడం లేదనేది కన్ ఫర్మ్.
First Published:  21 Feb 2016 12:32 AM GMT
Next Story