భూమా పౌరుషం… ఒక విశ్లేష‌ణ‌

రాజ‌కీయ విలువ‌లు దిగ‌జారిన తీరుకు ప‌ర్యాయ‌ప‌దంగా చాలా మంది రాజకీయ వ్య‌భిచారం అన్న ప‌దాన్ని వాడుతుంటారు. అయితే వ్య‌భిచారం చేసే స్త్రీమూర్తులు వారి పొట్ట‌కూటి కోసం ఆ ప‌నిచేస్తుంటారు. వారు ఎవరినీ వంచించ‌రు. వారు ఎలాగో ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌రు కాబ‌ట్టి ఓటేసి జ‌నం మోస‌పోవ‌డం అన్న‌ది కూడా ఉండ‌దు. కానీ రాజ‌కీయ నాయ‌కులే ప్ర‌జా తీర్పును ప‌దేప‌దే అందిన‌కాడికి అమ్ముకుంటున్నారు. ఇలాంటి రాజ‌కీయాల్లో సాధార‌ణ నాయ‌కులు ఒక ఎత్తు… భూమా నాగిరెడ్డి లాంటి వారు మ‌రో ఎత్తు. ఎందుకంటే ఆయ‌న పుట్టింది క‌ర్నూలు జిల్లా. పెరిగింది కూడా ఫ్యాక్ష‌న్ నేప‌థ్యంలో. సాధార‌ణంగా ఆ బ్యాక్ గ్రౌండ్‌లో పెరిగిన వారు న‌మ్మిన వాళ్ల కోసం ఏమైనా చేస్తారు… ప్ర‌త్య‌ర్థుల‌ను అదే స్థాయిలో ఎదురిస్తార‌ని చెబుతుంటారు. కానీ భూమాకు ఈ సిద్ధాంతం ఏమాత్రం స‌రిపోయేట‌ట్టుగా క‌నిపించ‌డం లేదు.

గ‌డిచిన రెండేళ్ల‌లో జ‌గ‌న్ కుటుంబం భూమా కుటుంబంతో ఎంత స‌న్నిహితంగా ఉందో… అందుకు పూర్తి రివర్స్‌లో చంద్ర‌బాబు అదే స్థాయిలో భూమా కుటుంబాన్ని వెంటాడారు. 2014 ఎన్నిక‌ల స‌మ‌యంలో నామినేష‌న్ వేసిన త‌ర్వాత శోభానాగిరెడ్డి చ‌నిపోతే సానుభూతి తెలపాల్సింది పోయి… బ్యాలెట్ నుంచి ఆమె పేరును తొల‌గించాల‌ని డిమాండ్ చేసిన పార్టీ టీడీపీ. ఈ విష‌యం కూడా భూమాకు గుర్తు ఉండే  ఉంటుంది. శోభానాగిరెడ్డి చ‌నిపోయిన త‌ర్వాత కూడా గెలుపుసాధించారు.

 టీడీపీ అధికారంలోకి వ‌చ్చింది. ఆళ్లగడ్డకు ఉప ఎన్నిక అనివార్యమైంది. సాధార‌ణంగా అయితే అఖిల ప్రియ‌పై పోటీ ఆలోచ‌న టీడీపీ  చేయ‌కూడ‌దు. కానీ చివ‌రి నిమిషం వ‌ర‌కు అభ్య‌ర్థిని నిల‌బెడుతామ‌ని ఒత్తిడికి గురిచేసింది చంద్ర‌బాబు పార్టీ కాదా?. ఒక డిఎస్పీని ”డోన్ట్ ట‌చ్ మీ” అన్నందుకు ఎస్సీఎస్టీ కేసు పెట్టి భూమాను బొక్క‌లో వేయించింది కూడా చంద్ర‌బాబు ప్ర‌భుత్వ‌మే. అంతెందుకు… నియోజ‌క‌వ‌ర్గాల అభివృద్ధి నిధుల కేటాయింపులో  అఖిల ప్రియ‌ను చంద్ర‌బాబు ప్ర‌భుత్వం అసలు ఎమ్మెల్యేగా కూడా గుర్తించలేదు.  టీడీపీ ఇన్‌చార్జ్ గంగుల ప్ర‌తాప్ రెడ్డిని ఆళ్ళగడ్డ ఎమ్మెల్యేగా పేర్కొంటూ ఏకంగా జీవో జారీ చేసి నిధులు ఆయ‌న‌కు అప్ప‌గించారు. ఆ విష‌యం కూడా భూమా మ‌రిచిపోయి ఉండరు. ఇలా నిత్యం వెంటాడిన చంద్ర‌బాబు చెంత‌కు భూమా చేరుతున్నారంటే రాజ‌కీయ విన్యాసాల్లో ఇదో ఆస‌క్తిక‌ర‌మైన‌ విన్యాస‌మే. సీమ నేతల్లోనూ ఫ్లెక్సిబులిటీ పెరిగిందని నిరూపించడమే.

ఇక జ‌గ‌న్ వైపు నుంచి భూమాకు జ‌రిగిన లాభ న‌ష్టాల‌ను ప‌రిశీలిస్తే. జ‌గ‌న్ వ‌ల్ల భూమాకు ఏం న‌ష్టం జ‌రిగిందో ఇప్ప‌టికీ ఎవ‌రూ చెప్ప‌లేక‌పోతున్నారు. బ‌హుశా పార్టీని వీడిన త‌ర్వాత జ‌గ‌న్‌కు వ్యతిరేకంగా  భూమా కూడా కొత్త విష‌యాలు చెబుతారేమో చూడాలి. ఆయన తప్పకుండా చెబుతారు. ఎందుకంటే మొన్నీమధ్య ఒక ఇంటర్వ్యూలో చంద్రబాబు వ్యక్తిత్వాన్ని ఓ రేంజ్లో భూమా తప్పుపట్టారు. అప్పడు వైసీపీలో ఉన్నారు కాబట్టి అలా చేసి ఉంటారు. ఇప్పుడు టీడీపీలో చేరితే జగన్ గురించి కూడా అలాంటి వ్యాఖ్యలే చేస్తారు.

ప్ర‌తిప‌క్ష పార్టీకి ద‌క్కే ఏకైక ప‌ద‌వి పీఏసీ చైర్మ‌న్‌ను కూడా భూమాకే జ‌గ‌న్ అప్ప‌గించారు. వైఎస్ విజ‌య‌మ్మ‌, శోభానాగిరెడ్డికి ఇచ్చిన ప్రాధాన్య‌త ఏంటో జ‌నం కూడా చూశారు. భూమా నాగిరెడ్డి పార్టీ వీడుతున్నార‌ని వార్త‌లు రాగానే వైసీపీకి తేరుకోవ‌డానికి చాలా స‌మ‌య‌మే ప‌ట్టింది. భూమా ఇచ్చిన షాక్ నుంచి తేరుకోవ‌డానికి స‌మ‌యం ప‌ట్టింద‌ని మ‌నం అనుకోవ‌చ్చు. కానీ సొంత‌మ‌నిషి అనుకున్న వ్య‌క్తి వైరి ప‌క్షంతో చేతులు క‌లిపాడని తెలిసిన త‌ర్వాత తేరుకోవ‌డానికి జ‌గ‌న్‌కే కాదు మ‌నిష‌న్న వాడికి చాలా స‌మ‌య‌మే ప‌డుతుంది. ఏదీ ఏమైనా త‌క్కువ కాలంలోనే అన్ని పెద్ద‌ పార్టీలను విజ‌య‌వంతంగా చుట్టేసి మ‌ళ్లీ తొలిస్థానానికి భూమా చేరుతున్న‌ట్టుగా ఉంది.

Click on image to read:  

kcr-chandrababu-naidu

 

cbn ysrcp mlas

zee-news

jagan-cbn

jagan-ntv

ycp-leaders-join-to-tdp

 

rama-subba-reddy

bhuma-regin

basavaraju-saraiah

 

Guvvala-Balaraju

chandrababu-skin-problems

jagan

chandrababu-naidu

nara-lokesh-naidu

jagan-sakshi

bhuma-nari-reddy-jagan

jagan-k

jagan-chandrababu