Telugu Global
Cinema & Entertainment

ఒక హీరోయిన్ కోసం ఇద్ద‌రు హీరోలు ...!

ఆటు బాలీవుడ్ కాని.. ఇటు టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో కాని ఒక్కసారి ఓ హీరో హీరోయిన్ జంట‌ క్లిక్ అయితే..అదే జంటను రీపిట్ గా చేస్తుంటారు. అలాంటి హిట్ అయిన జంటల‌ కోటాలో చాల మంది హీరో హీరోయిన్స్ వున్నారు. కాజ‌ల్, మ‌హేష్ బాబు.. స‌మంత‌, ఎన్టీఆర్.. రాంచ‌ర‌ణ్ , ర‌కుల్ ప్రీతిసింగ్.. వెంక‌టేష్, న‌య‌న‌తార‌.. ఇలా ఈ జోడీల‌న్నింటిని రీపిటెడ్ గా అభిమానులు చూడ‌టానికి ఆస‌క్తి చూపుతార‌నేది ఒక పరిశీల‌న‌. అయితే ప్రస్తుత్తం రాసిఖ‌న్నాతో మాత్రం ఇద్ద‌రు […]

ఒక హీరోయిన్ కోసం ఇద్ద‌రు హీరోలు ...!
X

ఆటు బాలీవుడ్ కాని.. ఇటు టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో కాని ఒక్కసారి ఓ హీరో హీరోయిన్ జంట‌ క్లిక్ అయితే..అదే జంటను రీపిట్ గా చేస్తుంటారు. అలాంటి హిట్ అయిన జంటల‌ కోటాలో చాల మంది హీరో హీరోయిన్స్ వున్నారు. కాజ‌ల్, మ‌హేష్ బాబు.. స‌మంత‌, ఎన్టీఆర్.. రాంచ‌ర‌ణ్ , ర‌కుల్ ప్రీతిసింగ్.. వెంక‌టేష్, న‌య‌న‌తార‌.. ఇలా ఈ జోడీల‌న్నింటిని రీపిటెడ్ గా అభిమానులు చూడ‌టానికి ఆస‌క్తి చూపుతార‌నేది ఒక పరిశీల‌న‌.

అయితే ప్రస్తుత్తం రాసిఖ‌న్నాతో మాత్రం ఇద్ద‌రు హీరోలు క్యూలో వున్నారు. బెంగాల్ టైగ‌ర్ లో ర‌వితేజ స‌ర‌స‌న .. లౌక్యం చిత్రంలో గోపిచంద్ స‌ర‌స‌న ఈ ముద్దుగుమ్మ మెప్పించ‌డం..ఇద్ద‌రి హీరోల‌తోనూ హిట్స్ త‌న ఖాతాలోవేసుకోవ‌డంతో… రాసిఖ‌న్నా అటు ర‌వితేజ కు..ఇట గోపిచంద్ కు ల‌క్కీ హీరోయిన్ అయ్యింది మ‌రి.!ఇద్దరి హీరోల సినిమాలు ఒకేసారి సెట్స్ పైకి రావడంతో రాసి ఖన్నా డేట్స్ ఎడ్జస్ట్ చేయలేక సతమతవుతుందట. మరి ఇద్దిరి స్టార్ హీరోల ల‌క్కీ హీరోయిన్ అయితే ఆఫ‌ర్స్ కు ఏమి కొదవ వుండదు… ఈ సతమతవటమూ తప్పదు.

First Published:  22 Feb 2016 4:02 AM GMT
Next Story