Telugu Global
Cinema & Entertainment

గోపీచంద్ కూడా లిస్ట్ లో చేరిపోయాడా ?

ఈ వేసవికి ఇప్పటికే పోటీ తీవ్రంగా ఉంది. పవన్ కల్యాణ్, మహేష్ బాబు, నాగార్జున, నితిన్, రజనీకాంత్, సూర్య లాంటి చాలామంది హీరోలు సమ్మర్ లోనే సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. వీళ్లకంటే ముందు సందీప్ కిషన్, మంచు మనోజ్ లాంటి చిన్న హీరోలు కూడా తమ సినిమాలతో దూసుకొస్తున్నారు. ఇప్పుడీ వేడిలోకి గోపీచంద్ కూడా ఎంటరయ్యాడు. ఇంతమంది బడా హీరోల మధ్య తన సినిమాను కూడా విడుదల చేయడానికి గోపీచంద్ సిద్ధమయ్యాడు. ప్రస్తుతం జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఆక్సిజన్ […]

గోపీచంద్ కూడా లిస్ట్ లో చేరిపోయాడా ?
X
ఈ వేసవికి ఇప్పటికే పోటీ తీవ్రంగా ఉంది. పవన్ కల్యాణ్, మహేష్ బాబు, నాగార్జున, నితిన్, రజనీకాంత్, సూర్య లాంటి చాలామంది హీరోలు సమ్మర్ లోనే సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. వీళ్లకంటే ముందు సందీప్ కిషన్, మంచు మనోజ్ లాంటి చిన్న హీరోలు కూడా తమ సినిమాలతో దూసుకొస్తున్నారు. ఇప్పుడీ వేడిలోకి గోపీచంద్ కూడా ఎంటరయ్యాడు. ఇంతమంది బడా హీరోల మధ్య తన సినిమాను కూడా విడుదల చేయడానికి గోపీచంద్ సిద్ధమయ్యాడు. ప్రస్తుతం జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఆక్సిజన్ అనే సినిమా చేస్తున్నాడు గోపీచంద్. జగపతిబాబు, కిక్ శ్యామ్ కీలకపాత్రలు పోషిస్తున్న ఈసినిమా షూటింగ్ క్లైమాక్స్ కొచ్చింది. కుదిరితే ఈ సినిమాను ఏప్రిల్ చివర్లో… లేదా మే మొదటి వారంలో విడుదల చేయాలనుకుంటున్నాడు. ఇప్పటికే సౌఖ్యంతో పెద్ద ఫ్లాప్ తెచ్చుకున్నాడు గోపీచంద్. లౌక్యం, జిల్ సినిమాలందించిన కిక్ ను పూర్తిగా పోగొట్టుకున్నాడు. అందుకే ఆక్సిజన్ తో కొత్త ఉత్సాహం తెచ్చుకోవాలనే కసితో వేసవి రేసులోకి ఎంటరయ్యాడు.
First Published:  22 Feb 2016 3:30 AM GMT
Next Story