Telugu Global
Cinema & Entertainment

ఆ దర్శకుడు అక్కడే పాతుకుపోయాడు...

ఏ ముహూర్తాన సోగ్గాడే చిన్ని నాయనా సినిమాను ప్రారంభించోడా తెలీదు కానీ… నాగార్జునకు తెగ నచ్చేశాడు దర్శకుడు కల్యాణ్ కృష్ణ. అతడ్ని వదులుకోవడానికి కింగ్ ఏమాత్రం ఇష్టపడటం లేదు. ఇప్పటికే సోగ్గాడే సీక్వెల్ బాధ్యతల్ని కల్యాణ్ కృష్ణకు అప్పగించాడు నాగ్. త్వరలోనే బంగార్రాజు పేరుతో ఈ సీక్వెల్ సెట్స్ పైకి రాబోతోంది. ఇదే కాకుండా మరో రెండు ప్రాజెక్టుల్ని కూడా తన సొంత బ్యానర్ పై కల్యాణ్ కృష్ణకు అప్పగించే ఆలోచనలో ఉన్నాడు నాగ్. వీటిలో ఒక […]

ఆ దర్శకుడు అక్కడే పాతుకుపోయాడు...
X
ఏ ముహూర్తాన సోగ్గాడే చిన్ని నాయనా సినిమాను ప్రారంభించోడా తెలీదు కానీ… నాగార్జునకు తెగ నచ్చేశాడు దర్శకుడు కల్యాణ్ కృష్ణ. అతడ్ని వదులుకోవడానికి కింగ్ ఏమాత్రం ఇష్టపడటం లేదు. ఇప్పటికే సోగ్గాడే సీక్వెల్ బాధ్యతల్ని కల్యాణ్ కృష్ణకు అప్పగించాడు నాగ్. త్వరలోనే బంగార్రాజు పేరుతో ఈ సీక్వెల్ సెట్స్ పైకి రాబోతోంది. ఇదే కాకుండా మరో రెండు ప్రాజెక్టుల్ని కూడా తన సొంత బ్యానర్ పై కల్యాణ్ కృష్ణకు అప్పగించే ఆలోచనలో ఉన్నాడు నాగ్. వీటిలో ఒక సినిమా నాగచైతన్యతో ఉంటుంది. ప్రస్తుతం సాహసం శ్వాసగా సాగిపో, ప్రేమమ్ సినిమాలతో బిజీగా ఉన్న నాగచైతన్య… ఈ రెండు సినిమాల్ని కంప్లీట్ చేసిన తర్వాత… అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సినిమా చేస్తాడు. ఈ రెండు మూవీస్ తో పాటు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై మరో సినిమాకు కూడా సంతకం చేశాడు కల్యాణ్ కృష్ణ. అయితే ఆ సినిమా ఎప్పుడుంటుంది… ఎవరితో ఉంటుందనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్. బంగార్రాజు మూవీతో పాటు చైతూ సినిమా కూడా హిట్టయితే… అఖిల్ మూడో సినిమా ఆఫర్ ను కల్యాణ్ కృష్ణ కు అందించే ఆలోచనలో నాగ్ ఉన్నట్టు తెలుస్తోంది.
First Published:  22 Feb 2016 1:37 AM GMT
Next Story