Telugu Global
WOMEN

క‌ట్నం అడిగారు...పెళ్లే వ‌ద్దు పొమ్మంది!

యువ‌తీ యువ‌కుల్లో మార్పు వ‌స్తే కానీ క‌ట్నం స‌మ‌స్య స‌మ‌సిపోదు…అనేందుకు నిద‌ర్శ‌నంగా ఈ మ‌ధ్య‌కాలంలో కొన్ని సంఘ‌ట‌న‌లు మ‌న‌క‌ళ్ల‌ముందుకు వ‌స్తున్నాయి.  రాజ‌స్థాన్‌లోని ఫైతాపురా గ్రామానికి చెందిన భార‌తీ యాద‌వ్ అనే అమ్మాయి అలాగే చేసింది. శంభుద‌యాళ్ అనే వ‌రుడు, అత‌ని త‌ర‌పు వారు, అమ్మాయి త‌ర‌పు వారిని, కారు కావాల‌ని డిమాండ్ చేయ‌డంతో భార‌తి స‌రాస‌రి స‌మీప పోలీస్ స్టేష‌న్‌కి వెళ్లి ఫిర్యాదు చేసింది. నిశ్చితార్థంలో మోటారు సైకిల్‌, బంగారం కానుక‌లుగా ఇచ్చారు. అయినా వ‌రుడి త‌ర‌పు […]

క‌ట్నం అడిగారు...పెళ్లే వ‌ద్దు పొమ్మంది!
X

యువ‌తీ యువ‌కుల్లో మార్పు వ‌స్తే కానీ క‌ట్నం స‌మ‌స్య స‌మ‌సిపోదు…అనేందుకు నిద‌ర్శ‌నంగా ఈ మ‌ధ్య‌కాలంలో కొన్ని సంఘ‌ట‌న‌లు మ‌న‌క‌ళ్ల‌ముందుకు వ‌స్తున్నాయి. రాజ‌స్థాన్‌లోని ఫైతాపురా గ్రామానికి చెందిన భార‌తీ యాద‌వ్ అనే అమ్మాయి అలాగే చేసింది. శంభుద‌యాళ్ అనే వ‌రుడు, అత‌ని త‌ర‌పు వారు, అమ్మాయి త‌ర‌పు వారిని, కారు కావాల‌ని డిమాండ్ చేయ‌డంతో భార‌తి స‌రాస‌రి స‌మీప పోలీస్ స్టేష‌న్‌కి వెళ్లి ఫిర్యాదు చేసింది.

carనిశ్చితార్థంలో మోటారు సైకిల్‌, బంగారం కానుక‌లుగా ఇచ్చారు. అయినా వ‌రుడి త‌ర‌పు వారు నిశ్చితార్థం అయిపోయాక కారు ఇవ్వ‌క‌పోతే పెళ్లి క్యాన్సిల్ చేస్తామ‌ని బెదిరించారు. పెళ్లి స‌మ‌యానికి కారు ఇవ్వ‌లేన‌ని భార‌తి తండ్రి ప్రాధేయ ప‌డ‌టంతో, ఆరునెల‌ల్లోగా కారు కొనిస్తామ‌ని ఒప్పుకుంటూ ప్రామిస‌రీ నోటుమీద సంత‌కం చేయాల‌ని ఒత్తిడి తెచ్చారు. దాంతో భార‌తి నేరుగా వెళ్లి పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. పోలీసులు వ‌రుడు అత‌ని త‌ర‌పు వారంద‌రిపై వ‌ర‌క‌ట్నం కేసు న‌మోదు చేశారు.

First Published:  22 Feb 2016 12:55 AM GMT
Next Story