Telugu Global
Cinema & Entertainment

బాహుబలి పార్ట్-2 రిలీజ్ డేట్ ఫిక్స్

బాహుబలికి సంబంధించి సెకెండ్ పార్ట్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కానీ సినిమా విడుదల ఎప్పుడనే విషయాన్ని మాత్రం మేకర్స్ ఇప్పటివరకు వెల్లడించలేదు. ఈ ఏడాది చివర్లో విడుదలవుతుందని కొందరంటే… వచ్చే ఏడాదే థియేటర్లలోకి వస్తుందని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఫైనల్ గా ఈ సినిమాకు సంబంధించిన డేట్స్ కొన్ని ఫిక్స్ చేశాడట రాజమౌళి. తాజా సమాచారం ప్రకారం… ఈ ఏడాది చివరి నాటికి బాహుబలి పార్ట్-2 టీజర్ విడుదల చేసి… వచ్చే ఏడాది సమ్మర్ ఎట్రాక్షన్ గా సినిమాను […]

బాహుబలి పార్ట్-2 రిలీజ్ డేట్ ఫిక్స్
X
బాహుబలికి సంబంధించి సెకెండ్ పార్ట్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కానీ సినిమా విడుదల ఎప్పుడనే విషయాన్ని మాత్రం మేకర్స్ ఇప్పటివరకు వెల్లడించలేదు. ఈ ఏడాది చివర్లో విడుదలవుతుందని కొందరంటే… వచ్చే ఏడాదే థియేటర్లలోకి వస్తుందని మరికొందరు అభిప్రాయపడ్డారు. ఫైనల్ గా ఈ సినిమాకు సంబంధించిన డేట్స్ కొన్ని ఫిక్స్ చేశాడట రాజమౌళి. తాజా సమాచారం ప్రకారం… ఈ ఏడాది చివరి నాటికి బాహుబలి పార్ట్-2 టీజర్ విడుదల చేసి… వచ్చే ఏడాది సమ్మర్ ఎట్రాక్షన్ గా సినిమాను థియేటర్లలోకి దించాలనుకుంటున్నారు.
ప్రస్తుతానికైతే… ఈ ఏడాది అక్టోబర్ లో బాహుబలి ది కన్ క్లూజన్ సినిమా టీజర్ ను విడుదల చేయాలని అనుకుంటున్నారట. వచ్చే ఏడాది ఏప్రిల్ లో సమ్మర్ ఎట్రాక్షన్ గా సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలనుకుంటున్నారు. నిజానికి సినిమా షూటింగ్ ఈ ఏడాది చివరి నాటికే కంప్లీట్ అయిపోతుంది. కానీ ప్రమోషన్ కు ఎక్కువ టైం తీసుకోవాలనే ఉద్దేశంతో సమ్మర్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రాబోతోంది.
First Published:  23 Feb 2016 7:19 AM GMT
Next Story