తుంట రెడ్లతో రాజ్యమేలడం సాధ్యమా?

చంద్రబాబు రాజ‌కీయ లెక్క‌ల‌న్నీ కుల కుంప‌ట్ల ప్రాతిప‌దిక‌న‌ న‌డుస్తాయ‌న్న‌ది జ‌గ‌మెరిగిన స‌త్యం. అప్ప‌టి వ‌ర‌కు క‌లిసిమెలిసి తిరిగిన మాల మాదిగ‌ల మ‌ధ్య వ‌ర్గీక‌ర‌ణ చిచ్చుపెట్టి ఒక వ‌ర్గం ఓట్ల‌ను ద‌గ్గ‌ర‌కు చేసుకున్నారు. కానీ వర్గీకరణ జరగకపోగా…  ఇప్ప‌టికీ మాల‌మాదిగ‌ల మ‌ధ్య చిచ్చు ర‌గులుతూనే ఉంది. ఎన్నిక‌ల్లో కాపుల‌కు రిజ‌ర్వేష‌న్లు ఇస్తాన‌ని చెప్పి తీరా ఇప్పుడు హ్యాండిచ్చారు. దాంతో కాపుల‌కు దూర‌మ‌య్యే ప‌రిస్థితి. ఈ నేప‌థ్యంలో కొత్త కులాల‌కు రంగు పూసే ప‌నిలో చంద్ర‌బాబు ఉన్నారు.

ముఖ్యంగా రాయ‌ల‌సీమ‌లో జ‌గ‌న్‌ ప్ర‌భావం అధికంగా ఉండ‌డంతో రెడ్ల‌పై చంద్ర‌బాబు దృష్టి పెట్టార‌ని చెబుతున్నారు. అందులో భాగంగానే ఆదినారాయ‌ణ‌రెడ్డిని, భూమా నాగిరెడ్డిని పార్టీలోకి తీసుకున్నార‌ని చెబుతున్నారు. కానీ భూమా, ఆదినారాయ‌ణ‌రెడ్ల‌ను పార్టీలో చేర్చుకున్నంత మాత్రాన రెడ్లు బాబుకు ద‌గ్గ‌రైపోతారా?. అలా ఎవ‌రైనా అనుకుంటే అది వారి అమాయ‌క‌త్వ‌మే. ఎందుకంటే బై బ‌ర్త్ చంద్ర‌బాబు రెడ్లకు వ్యతిరేకం. వెంకటేశ్వరా యూనివర్శిటీలో విద్యార్ధినాయకుడిగా ఆయన రాజకీయ ప్రస్ధానం ప్రారంభించిందే కులరాజకీయాలతో. అందుకే ఆయన రాజ‌కీయాల‌కు రెడ్డి సామాజిక‌వ‌ర్గం వ్యతిరేకం. పైగా కొంద‌రు రెడ్డి నేత‌లు అమ్ముడుపోయి చంద్ర‌బాబు మోచేతి నీళ్లు తాగినా… సాధార‌ణ రెడ్లు మాత్రం ఆ పని కలలోనైనా చేయలేరు.  పైగా ఇప్పుడు చంద్రబాబు చేసిన పనితో ఒక్క‌శాతం  రెడ్లు కూడా టీడీపీకి ఇక‌పై ఓటేసే ప‌రిస్థితి ఉండ‌ద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

భూమా, ఆదినారాయ‌ణ‌రెడ్డిల‌ను చేర్చుకోవ‌డం ద్వారా చంద్ర‌బాబుపై రెడ్డి సామాజిక‌వర్గంలో వ్య‌తిరేక‌త మ‌రిన్ని రెట్లు పెరిగే ప‌రిస్థితి ఉంది. ఎందుకంటే  ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ను తుంట రెడ్ల‌పై ప్ర‌యోగించి రాజ‌కీయంగా స‌ద‌రు సామాజిక‌వ‌ర్గాన్ని బ‌ల‌హీన ప‌రిచేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నార‌ని వారు గుర్తించారు. పైగా భూమా నాగిరెడ్డి, ఆదినారాయ‌ణ‌రెడ్డి గురించి అంద‌రికీ బాగానే తెలిసింది. భూమా … రెడ్డి అయిన‌ప్ప‌టికీ ఆయ‌న బ్ల‌డ్ లో ప్రవహించేది టీడీపీయే. అయితే భూమా ఫ్యామిలీకి జగన్ విపరీతమైన ప్రాధాన్యత ఇచ్చాక కూడా నాగిరెడ్డి హ్యాండివ్వడంతో వైసీపీ అభిమానులు షాక్ అయ్యారు.

ఇక ఆదినారాయ‌ణ‌రెడ్డి ప‌దేళ్ల‌లో చేసిన విన్యాసాలు అన్ని ఇన్నీ కావు. వైఎస్ మ‌ర‌ణం త‌ర్వాత కొద్దికాలం రోశ‌య్య‌తో స‌న్నిహితంగా మెలిగారు. అనంత‌రం జ‌గ‌న్‌తో చేయి క‌లిపారు. మ‌ళ్లీ జ‌గ‌న్ తీరు న‌చ్చ‌లేదంటూ కిర‌ణ్‌కుమార్ రెడ్డితో రాసుకుపూసుకుని తిరిగారు.  తీరా ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌గ‌న్ చెంత చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీ అధికారంలోకి రాక‌పోవ‌డంతో మ‌ళ్లీ బాబు బ్యాచ్‌లో చేరారు. కాబ‌ట్టి ఇలాంటి నేత‌ల‌ను పార్టీలోకి చేర్చుకున్నంత మాత్రాన రెడ్లంతా టీడీపీకి ద‌గ్గ‌ర‌వుతార‌నుకోవ‌డం టీడీపీ అమాయ‌క‌త్వ‌మే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2014లో చంద్ర‌బాబు రాజ్య‌మేలేందుకు కాపుల‌ను బ‌క‌రాల‌ను చేశారు. 2019కు కొత్త బ‌క‌రాల‌ను సిద్ధం చేసేందుకు చంద్ర‌బాబు క‌స‌ర‌త్తు మొద‌లుపెట్టిన‌ట్టుగా అనిపిస్తోంది.

Click on image to read:  

kodali-nani

chiru

jagan-press-meet in delhi

jagan-bhuma1

cbn

kcr-chandrababu-naidu

cbn ysrcp mlas

zee-news

 

ycp-leaders-join-to-tdp

jagan-ntv

rama-subba-reddy

basavaraju-saraiah

bhuma-nagi-reddy-life

bhuma-regin

Guvvala-Balaraju

chandrababu-skin-problems

jagan

chandrababu-naidu

nara-lokesh-naidu

jagan-sakshi

bhuma-nari-reddy-jagan

jagan-k

jagan-chandrababu