చంద్రబాబును తిట్టారా? పొగిడారా?

ఇటీవల నేతలు పార్టీ మారడం టీవీలో చానల్ మార్చినంత ఈజీ పనిగా మారిపోయింది. ప్రొద్దున పార్టీ మారుతున్న వార్తలను ఖండించడం సాయంత్రానికి పక్కపార్టీలో కనిపించడం కామనైపోయింది. అయితే అలా పార్టీ మారిన నేతలు కొన్ని రోటీన్ కారణాలు చెబుతుంటారు. ఇదివరకు ఉన్న పార్టీ వైఖరి నచ్చలేదనో… పార్టీ అధినేత తీరు బాగోలేదనో… అందువల్లే పార్టీ మారుతున్నామని చెబుతుంటారు. అయితే వైసీపీని వీడి టీడీపీలో చేరిన భూమానాగిరెడ్డి, అఖిల ప్రియ, జలీల్ ఖాన్, ఆదినారాయణరెడ్డి మాత్రం విచిత్రమైన సమాధానమే చెప్పారు.

ఒక విధంగా చంద్రబాబు పాలన మొత్తం వివ‌క్ష‌, వేధింపుల‌తో సాగుతోంద‌ని ప‌రోక్షంగా మీడియా ముఖంగానే చెప్పారు. జ‌లీల్ ఖాన్ కామెంట్స్ చూస్తే… నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి కోస‌మే పార్టీ మారుతున్నాన‌ని చెప్పారు. రెండేళ్ల కాలంలో త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఒక్క‌ప‌ని కూడా జ‌ర‌గ‌లేద‌ని సెల‌విచ్చారు. మరి అలా జ‌ర‌గ‌క పోవడానికి కార‌ణం ఎవ‌రు ఖాన్ ?. చంద్ర‌బాబు కాదా?. ఎన్నిక‌లు ముగిసి  ముఖ్య‌మంత్రిగా ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత అన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌ను స‌మ‌దృష్టితో చూడాల్సిన బాధ్య‌త ముఖ్య‌మంత్రిపై ఉంటుంది. అస‌లైన నాయ‌కుడి ల‌క్ష‌ణం కూడా అదే. కానీ ఏపీలో అలా జరగడం లేదని గోడదూకిన గోపిలే ప‌రోక్షంగా బ‌య‌ట‌పెట్టారు.

 రాజ‌కీయాల్లో ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్న అఖిల‌ప్రియతో పాటు ఆమె తండ్రి భూమా  కూడా నిజాయితీగా అసలు విషయం చెప్పారు. 20 ఏళ్లుగా ఆళ్ల‌గ‌డ్డ అభివృద్ధికి నోచుకోలేద‌న్నారు.  స‌రే గ‌డిచిన ప‌దేళ్ల‌లో ఆళ్ల‌గ‌డ్డ అభివృద్ధి ఆగిపోయిందంటే అర్థ‌ముంది. కానీ అంత‌కు ముందు ముఖ్య‌మంత్రిగా ఉన్నది చంద్ర‌బాబే క‌దా. బాబు తొమ్మిదేళ్లే సీఎంగా ఉన్న‌ప్పుడు భూమా ఫ్యామిలీ టీడీపీలోనే ఉంది క‌దా!. మరి ఆళ్లగడ్డ అభివృద్ధి అప్పుడు కూడా ఎందుకు ఆగిందో భూమానే చెప్పాలి.

రెండేళ్లుగా త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఒక్క ప‌ని కూడా జ‌ర‌గ‌లేద‌ని జలీల్ ఖాన్ చెబుతున్నారు. ప‌నులు ఆపుతార‌నే టీడీపీలో చేరుతున్న‌ట్టు ఆయనంటున్నారు.  అంటే టీడీపీ మీద అభిమానంతో కాకుండా చంద్రబాబు బెదిరింపులకు భయపడే తాము టీడీపీలో చేరామని పరోక్షంగా భూమాతో పాటు జలీల్ ఖాన్ కూడా బయటపెట్టారు.  చంద్రబాబు తన పార్టీ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల విషయంలో ఒకలాగా… ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉండే నియోజ‌క‌వ‌ర్గాల‌పై మ‌రోలాగా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని… వివ‌క్ష చూపుతున్నార‌ని బ‌య‌ట‌పెట్టారు. ఇన్ డైరెక్ట్ గా చంద్ర‌బాబు బుద్దిని వారు త‌ప్పుప‌ట్టారు. చంద్ర‌బాబు రాజ‌కీయం వివ‌క్ష‌పూరితంగానే ఉంటుంద‌ని… కాబ‌ట్టి ప‌నులు జ‌ర‌గాలంటే సిగ్గువిడిచి టీడీపీలో చేర‌డం త‌ప్ప మ‌రో మార్గం లేద‌ని పిలుపునిచ్చిన‌ట్టుగా ఉంది.   అయితే ఇక్కడ అసలు నిజం ఏమిటంటే కొన్ని నియోజకవర్గాల్లోనే కాదు… ఏపీలో అన్ని నియోజకవర్గాల్లోనూ అభివృద్ధి తీరు కాగితాల్లోనే కనిపిస్తోంది.  మొత్తానికి  నలుగురు ఎమ్మెల్యేలు కలిసి ఇల్లు అలికారు.. మ‌రి పండుగ ఎలా ఉంటుందో!

Click on image to read:  

chandrababu-naidu

kodali-nani

chiru

jagan-press-meet in delhi

jagan-bhuma1

cbn

kcr-chandrababu-naidu

zee-news

Gyan-Dev-Ahuja

jagan-cbn

ycp-leaders-join-to-tdp

jagan-ntv

rama-subba-reddy

basavaraju-saraiah

bhuma-nagi-reddy-life

bhuma-regin

Guvvala-Balaraju

chandrababu-skin-problems

jagan

chandrababu-naidu

nara-lokesh-naidu