Telugu Global
National

పోలీసుల‌కు చిక్కిన ట్యాంప‌రింగ్‌కు వీలున్న‌ ఫోన్లు!

ఫోన్‌ని టాంప‌రింగ్‌ చేస్తే నేరం. మ‌రి అలాంటి ఫోన్ల‌ను అమ్మితే…అదీ నేర‌మే అవుతుంది. అలా ట్యాంప‌రింగ్‌కు అనుకూలంగా ఉన్న ఫోన్లను  అమ్ముతున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. అహ్మ‌దాబాద్ సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ నేరం కింద ఇద్ద‌రు వ్యాపారుల‌పై కేసులు న‌మోదు చేశారు. అహ్మ‌దాబాద్ రిలీఫ్ రోడ్డు, క‌ర్ణావ‌తి మాల్‌లోని రెండు షాపుల్లో పోలీసులు ఈ ఫోన్ల‌ను గుర్తించారు. ఇంట‌ర్నేష‌న‌ల్ మొబైల్ ఎక్పిప్‌మెంట్ (ఎఎమ్ఇఐ) నెంబ‌రుని మార్చి ఈ ఫోన్ల‌ను టాంప‌రింగ్‌కి వినియోగించే వీలు […]

పోలీసుల‌కు చిక్కిన ట్యాంప‌రింగ్‌కు వీలున్న‌ ఫోన్లు!
X

ఫోన్‌ని టాంప‌రింగ్‌ చేస్తే నేరం. మ‌రి అలాంటి ఫోన్ల‌ను అమ్మితే…అదీ నేర‌మే అవుతుంది. అలా ట్యాంప‌రింగ్‌కు అనుకూలంగా ఉన్న ఫోన్లను అమ్ముతున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. అహ్మ‌దాబాద్ సిటీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ నేరం కింద ఇద్ద‌రు వ్యాపారుల‌పై కేసులు న‌మోదు చేశారు.

అహ్మ‌దాబాద్ రిలీఫ్ రోడ్డు, క‌ర్ణావ‌తి మాల్‌లోని రెండు షాపుల్లో పోలీసులు ఈ ఫోన్ల‌ను గుర్తించారు. ఇంట‌ర్నేష‌న‌ల్ మొబైల్ ఎక్పిప్‌మెంట్ (ఎఎమ్ఇఐ) నెంబ‌రుని మార్చి ఈ ఫోన్ల‌ను టాంప‌రింగ్‌కి వినియోగించే వీలు ఉంది. పోలీసులు 3,058 ఫోన్ల‌ను ఈ అనుమానంతో ఫొరెన్సిక్ ప‌రీక్ష‌కు పంప‌గా అందులో 2,331 ఫోన్ల‌లో ఇలాంటి లోపాలున్న‌ట్టుగా గుర్తించారు. ఈ ఫోన్ల త‌యారీలో ఉన్న లోపం కార‌ణంగా వీటిని దుర్వినియోగం చేసే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంద‌ని, ఒక్క‌సారి ఎఎమ్ఇఐ నెంబ‌రుని మార్చి ఫోన్ల‌ను చ‌ట్ట‌వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కోసం వాడితే వాటిని ప‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మ‌ని పోలీసులు చెబుతున్నారు.

పోలీసులు స్వాధీనం చేసుకున్న ఫోన్ల విలువ 21.87 ల‌క్ష‌లు. వీటిని భార‌త్‌లోనే త‌యారుచేశారు. టాంప‌ర్ చేయ‌డానికి వీలుగా ఉన్న ఈ ఫోన్ల‌ను ఇప్ప‌టివ‌ర‌కు ఎవ‌రికైనా అమ్మారా లేదా అనే విష‌యాన్ని పోలీసులు ప‌రిశీలిస్తున్నారు. అలాగే మార్కెట్లో ఆ ఫోన్ల‌ను విక్ర‌యిస్తున్న వారికి వాటిలో ఉన్న లోపాల గురించి తెలుసా లేదా, అనే విష‌యంమీద కూడా పోలీసులు దృష్టి పెట్టారు.

ఫోన్లను మార్కెట్‌కి పంపేముందు అన్ని ర‌కాల నియ‌మ‌నిబంధ‌న‌ల‌ను పాటిస్తున్నారా లేదా అనే విష‌యాన్ని తెలుసుకునేందుకు వాటి త‌యారీకి బాధ్యులైన వారిని కూడా ప్ర‌శ్నిస్తామ‌ని పోలీసులు తెలిపారు. ట్యాంప‌ర్ చేయ‌డానికి వీలుగా ఉన్న ఇలాంటి ఫోన్లు, స‌మాజ వ్య‌తిరేక శ‌క్తుల చేతుల్లోకి వెళితే చాలా ప్ర‌మాద‌మ‌ని, ఒక్క‌సారి హ్యాండ్‌సెట్ గుర్తింపు నెంబ‌రైన ఎఎమ్ఇఐ నెంబ‌రుని మారిస్తే వాటిని ప‌ట్టుకోవ‌డం అసాధ్య‌మ‌ని క్రైం బ్రాంచ్ సీనియ‌ర్ అధికారి ఒక‌రు అన్నారు.

First Published:  22 Feb 2016 1:02 PM GMT
Next Story