Telugu Global
CRIME

కారు న‌డుపుతూ రొమాన్స్‌...కాటికి చేర్చింది!

ఈ మ‌ధ్య‌కాలంలో  కారుని వేగంగా  న‌డుపుతూ ప్రేమ క‌లాపాల్లో మునిగితేల‌డాన్ని కూడా కొంత‌మంది ఒక సాహ‌స కార్యంగానే భావిస్తున్నారు. ఇలాగే చేసిన ఒక జంట ప్రాణాల‌మీద‌కు తెచ్చుకుంది. ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని పురాన్‌పూర్‌కి  చెందిన 31 సంవ‌త్సరాల యువ‌కుడు, అదే రాష్ట్రంలోని ఫిలిబిత్‌కి త‌న ప్రేయ‌సి కోసం వెళ్లాడు. త‌రువాత వారు ఫిలిబిత్‌, పురాన్‌పూర్ హైవే మీద కారులో బ‌య‌లుదేరారు. అప్ప‌టికే బాగా చీక‌టి ప‌డిపోయింది.  పైగా డ్రైవింగ్ చేస్తున్న యువ‌కుడు దానిమీద దృష్టి పెట్ట‌కుండా ప్రేయ‌సితో ప్రేమ‌క‌లాపాలు […]

కారు న‌డుపుతూ రొమాన్స్‌...కాటికి చేర్చింది!
X

ఈ మ‌ధ్య‌కాలంలో కారుని వేగంగా న‌డుపుతూ ప్రేమ క‌లాపాల్లో మునిగితేల‌డాన్ని కూడా కొంత‌మంది ఒక సాహ‌స కార్యంగానే భావిస్తున్నారు. ఇలాగే చేసిన ఒక జంట ప్రాణాల‌మీద‌కు తెచ్చుకుంది. ఉత్త‌ర ప్ర‌దేశ్‌లోని పురాన్‌పూర్‌కి చెందిన 31 సంవ‌త్సరాల యువ‌కుడు, అదే రాష్ట్రంలోని ఫిలిబిత్‌కి త‌న ప్రేయ‌సి కోసం వెళ్లాడు. త‌రువాత వారు ఫిలిబిత్‌, పురాన్‌పూర్ హైవే మీద కారులో బ‌య‌లుదేరారు. అప్ప‌టికే బాగా చీక‌టి ప‌డిపోయింది. పైగా డ్రైవింగ్ చేస్తున్న యువ‌కుడు దానిమీద దృష్టి పెట్ట‌కుండా ప్రేయ‌సితో ప్రేమ‌క‌లాపాలు మొద‌లుపెట్టాడు. దాంతో డ్రైవింగ్ మీద ప‌ట్టుత‌ప్పి వెనుక‌నుండి వేగంగా వ‌స్తున్న ట్ర‌క్‌ నుండి త‌ప్పించుకోలేక‌పోయాడు. ట్ర‌క్ వేగంగా వ‌చ్చి గుద్ద‌టంతో కారుని న‌డుపుతున్న యువ‌కుడు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు. యువ‌తి త‌ల‌కు, కాలికి గాయాలయ్యాయి. ఆమెకు ప్రాణాపాయం త‌ప్పింది. యాక్సిడెంటు జ‌రిగిన ప్రాంతంలో ఉన్న ఇళ్ల‌లోని వారు శ‌బ్దానికి బ‌య‌ట‌కు వ‌చ్చారు. వారు ర‌క్షించాల‌ని చూసినా యువ‌కుడు అప్ప‌టికే మ‌ర‌ణించాడు. వారి దుస్తులు ఉన్న ప‌రిస్థితిని బ‌ట్టి పోలీసులు, ప్ర‌మాదానికి కార‌ణం ప్రేమ క‌లాపాలే అని తేల్చారు.

First Published:  24 Feb 2016 12:33 AM GMT
Next Story