Telugu Global
Cinema & Entertainment

దీపిక బ్యాగ్ లో మ‌రో హాలీవుడ్ జాక్ పాట్..!

గ్లామ‌ర్, టాలెంట్, కాన్ఫిడెన్స్ , లౌక్యం క‌లిస్తే ..దీపిక ప‌దుకోణ్. ఆన్ స్క్రీన్ మీద త‌న‌దైన గ్లామ‌ర్, యాక్టింగ్ టాలెంట్ తో బాలీవుడ్ లో అన‌తి కాలంలోనే అగ్ర‌ప‌ధంలో దూసుకెళ్లిన ఈ ముద్దుగుమ్మ‌.. ప్ర‌స్తుతం హాలీవుడ్ లో ట్రిపుల్ ఎక్స్ అనే చిత్రం లో లీడ్ రోల్ చేస్తున్న విష‌యం తెలిసిందే. తాజా విశేషం ఏమిటంటే..ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వ‌క ముందే..ఈ ముద్దుగుమ్మ కు మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ త‌గిలిన‌ట్లు కధనాలు వినిపిస్తున్నాయి. హాలీవుడ్ మోస్ట్ […]

దీపిక బ్యాగ్ లో మ‌రో హాలీవుడ్ జాక్ పాట్..!
X

గ్లామ‌ర్, టాలెంట్, కాన్ఫిడెన్స్ , లౌక్యం క‌లిస్తే ..దీపిక ప‌దుకోణ్. ఆన్ స్క్రీన్ మీద త‌న‌దైన గ్లామ‌ర్, యాక్టింగ్ టాలెంట్ తో బాలీవుడ్ లో అన‌తి కాలంలోనే అగ్ర‌ప‌ధంలో దూసుకెళ్లిన ఈ ముద్దుగుమ్మ‌.. ప్ర‌స్తుతం హాలీవుడ్ లో ట్రిపుల్ ఎక్స్ అనే చిత్రం లో లీడ్ రోల్ చేస్తున్న విష‌యం తెలిసిందే.

తాజా విశేషం ఏమిటంటే..ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వ‌క ముందే..ఈ ముద్దుగుమ్మ కు మ‌రో బంప‌ర్ ఆఫ‌ర్ త‌గిలిన‌ట్లు కధనాలు వినిపిస్తున్నాయి. హాలీవుడ్ మోస్ట్ హండ్ స‌మ్ స్టార్స్ లో ఒక‌రైన బ్రాడ్ పిట్ చిత్రంలో దీపిక హీరోయిన్ చాన్స్ కొట్టేసింద‌నే టాక్ వినిపిస్తుంది. ఇది నిజ‌మైతే ఈ హ‌స్కీ బ్యూటీ హాలీవుడ్ లో కూడా మన జెండా పాతిన‌ట్లే. ఇప్ప‌టి వ‌ర‌కు హాలీవుడ్ లో చిన్న చిన్న రోల్స్ చేసిన బాలీవుడ్ న‌టీ న‌టులున్నారు గానీ.

ఇలా హీరోయిన్ గా అవ‌కాశం అంది పుచ్చుకున్న న‌టి మ‌ణి మాత్రం దీపిక పదుకోణ్ మాత్రమే అవుతుంది. సో ఇండియ‌న్ హీరోయిన్స్ హ‌వా ఇక హాలీవుడ్ లో కూడా ప్రారంభం కాబోతుంది అన‌డానికి దీపిక నే పెద్ద ఎగ్జాంపుల్ మ‌రి. ఆఫ్ కోర్స్ మ‌రో వైపు ప్రియాంక చోప్రా హాలీవుడ్ సిరియ‌ల్స్ లో త‌న‌దైన మార్క్ వేసి అక్క‌డ సూప‌ర్ పాపుల‌ర్ అయిన విష‌యం తెలిసిందే. మొత్తం మీద ఇదొక శుభ సూచ‌క‌మే.

First Published:  23 Feb 2016 8:47 PM GMT
Next Story