Telugu Global
Cinema & Entertainment

మ‌న్మ‌ధుడి హీరోయిన్...  ఆధ్యాత్మిక బాట‌లో!

నాగార్జున స‌ర‌స‌న సంతోషం సినిమాలో న‌టించిన గ్రేసీసింగ్ గుర్తుండే ఉంటుంది. త‌రువాత కూడా ఆమె త‌ప్పుచేసి ప‌ప్పు కూడు లాంటి కొన్ని తెలుగు చిత్రాల్లో న‌టించింది. అలాగే అమాన‌త్, ల‌గాన్, గంగాజ‌ల్‌, మున్నాభాయి ఎంబిబిఎస్ లాంటి బాలివుడ్ చిత్రాల్లోనూ న‌టించి పేరు తెచ్చుకుంది. అయితే  హీరోయిన్‌గా అవ‌కాశాలు వ‌స్తుండ‌గానే సినిమాలు చేయ‌డం మానేసింది. సినిమాలు మాత్ర‌మే ప‌ర‌మావ‌ధి కాద‌ని, జీవితానికి ఇంకేదో విస్తృత అర్థ‌ముంద‌ని అనిపించి ఆధ్యాత్మిక బాట‌లోకి వెళ్లింది. 2012లో ఆమె బ్ర‌హ్మ‌కుమారీస్‌లో చేరింది. దాంతో […]

మ‌న్మ‌ధుడి హీరోయిన్...  ఆధ్యాత్మిక బాట‌లో!
X

నాగార్జున స‌ర‌స‌న సంతోషం సినిమాలో న‌టించిన గ్రేసీసింగ్ గుర్తుండే ఉంటుంది. త‌రువాత కూడా ఆమె త‌ప్పుచేసి ప‌ప్పు కూడు లాంటి కొన్ని తెలుగు చిత్రాల్లో న‌టించింది. అలాగే అమాన‌త్, ల‌గాన్, గంగాజ‌ల్‌, మున్నాభాయి ఎంబిబిఎస్ లాంటి బాలివుడ్ చిత్రాల్లోనూ న‌టించి పేరు తెచ్చుకుంది. అయితే హీరోయిన్‌గా అవ‌కాశాలు వ‌స్తుండ‌గానే సినిమాలు చేయ‌డం మానేసింది.

సినిమాలు మాత్ర‌మే ప‌ర‌మావ‌ధి కాద‌ని, జీవితానికి ఇంకేదో విస్తృత అర్థ‌ముంద‌ని అనిపించి ఆధ్యాత్మిక బాట‌లోకి వెళ్లింది. 2012లో ఆమె బ్ర‌హ్మ‌కుమారీస్‌లో చేరింది. దాంతో త‌న‌కు కొత్త జీవితం వ‌చ్చిందంటుంది గ్రేసీ సింగ్‌. ఇప్పుడు ఆమె ఒక టివి సీరియ‌ల్‌లో న‌టిస్తోంది. అయితే అది కూడా భ‌క్తికి సంబంధించిన పాత్రే. సంతోషి మా అనే టివి సీరియ‌ల్‌లో ఆమె సంతోషిమాత‌గా న‌టిస్తోంది. ఒడిస్సీ, భ‌ర‌త‌నాట్యంల‌లో శిక్ష‌ణ తీసుకున్న గ్రేసీ, కొరియోగ్రాఫ‌ర్‌గా, ద‌ర్శ‌కురాలిగా త‌న నృత్య బృందంతో క‌లిసి ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇస్తోంది.

అలాగే గాంధీ ది హీరో అనే సినిమాలో న‌న్ పాత్ర‌లో న‌టిస్తోంది. తాను దేవుడికి భ‌య‌ప‌డే వ్య‌క్తిని కాన‌ని, దేవున్ని ప్రేమించే మ‌నిషిన‌ని, ఇలాంటి పాత్ర‌లు త‌న‌కెంతో ఆత్మ సంతృప్తిని, సంతోషాన్ని ఇస్తున్నాయ‌ని ఆమె తెలిపింది. గైడ్ సినిమాలోలా నృత్య‌ప్ర‌ధాన పాత్ర‌లు వ‌స్తే చేయాల‌ని ఉంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేసింది.

First Published:  25 Feb 2016 10:26 AM GMT
Next Story