Telugu Global
Cinema & Entertainment

బాల‌య్య వందో సినిమా కృష్ణ‌వంశీ తో..!

న‌టుల‌కు ఒక‌టో చిత్ర‌మైన.. వందో సినిమా అయిన ఒక్క‌టే. అయితే ఫ్యాన్స్ మాత్రం వేరే ర‌కంగా ఆలోచిస్తుంటారు. వందో సినిమా అయ్యే స‌రికి అదేదో క్రికెట్ లో సెంచ‌రి అంత ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. దీంతో హీరోల్లో కూడా ఒక విధ‌మైన బాధ్యత పెరుగుతుంటుంది. ప్ర‌స్తుతం డిక్టేట‌ర్ చిత్రంతో 99 చిత్రాలు పూర్తి చేసిన బాల‌య్య‌.. త‌న వందో సినిమా కోసం క‌స‌ర‌త్తు బాగానే చేస్తున్నార‌నే టాక్ వినిపిస్తుంది. వందో సినిమా కోసం బోయ‌పాటి శీను తోపాటు మ‌రికొందరు […]

బాల‌య్య వందో సినిమా కృష్ణ‌వంశీ తో..!
X

న‌టుల‌కు ఒక‌టో చిత్ర‌మైన.. వందో సినిమా అయిన ఒక్క‌టే. అయితే ఫ్యాన్స్ మాత్రం వేరే ర‌కంగా ఆలోచిస్తుంటారు. వందో సినిమా అయ్యే స‌రికి అదేదో క్రికెట్ లో సెంచ‌రి అంత ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. దీంతో హీరోల్లో కూడా ఒక విధ‌మైన బాధ్యత పెరుగుతుంటుంది. ప్ర‌స్తుతం డిక్టేట‌ర్ చిత్రంతో 99 చిత్రాలు పూర్తి చేసిన బాల‌య్య‌.. త‌న వందో సినిమా కోసం క‌స‌ర‌త్తు బాగానే చేస్తున్నార‌నే టాక్ వినిపిస్తుంది. వందో సినిమా కోసం బోయ‌పాటి శీను తోపాటు మ‌రికొందరు ద‌ర్శ‌కులు పేర్లు వినిపించాయి.

అయితే లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ పేరు తెర‌మీద‌కు వ‌చ్చింది. త‌న‌దైన మార్క్ చిత్రాలు చేసే కృష్ణ‌వంశీ ఇప్ప‌టి వ‌ర‌కు సీనియ‌ర్ స్టార్స్ తో ఎక్కువుగా చిత్రాలు చేయ‌లేదు. త‌న కెరీర్ ప్రారంభంలో నాగార్జున‌, ట‌బు ల‌తో నిన్నే పెళ్లాడుతా చిత్రం చేశాడు. ఇక తాజాగా బాల‌య్య వందో సినిమాకు సంబంధించి.. బాల‌య్య కెరీర్ లో ఇంత వ‌ర‌కు చేయ‌ని రోల్ క్రియోట్ చేశాడ‌ట‌. రైతు నాయ‌కుడిగా పోరాటం చేసేరోల్ ను క్రియోట్ చేశార‌ట. గ్రామీణ నేప‌థ్యంగా ఈ చిత్ర క‌థ సాగుతుంద‌ట. ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు కొద్ది రోజుల్లో తెలుస్తాయి అంటున్నారు బాల‌య్య స‌న్నిహితులు. రైతు నాయ‌కుడిగా ఇంత వ‌ర‌కు బాల‌య్య క‌నిపించ‌లేదు. మ‌రి కృష్ణ‌వంశీ ఏ రేంజ్ లో బాల‌య్య రోల్ ను డిజైన్ చేసి వుంటారో క‌దా..! ఎందుకంటే బాల‌య్య అంటే మాస్ ఆడియ‌న్స్ ఫాలోయింగ్ వున్న స్టార్ హీరో క‌దా.!

Click on Image to Read:

reshmi

balakrishna-chiru

First Published:  25 Feb 2016 5:21 AM GMT
Next Story