Telugu Global
Cinema & Entertainment

టైటిల్ సాంగ్ షూటింగ్ లో సర్దార్

సినిమా స్టార్టింగ్ లో వచ్చే టైటిల్ సాంగ్ ను… షూటింగ్ ఆఖర్లో ప్లాన్ చేశాడు పవన్ కల్యాణ్. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు సంబంధించి టైటిల్ సాంగ్ షూటింగ్ ను ఎట్టకేలకు మొదలుపెట్టాడు. హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో ఈ టైటిల్ సాంగ్ షూటింగ్ ప్రారంభమైంది. వారం రోజుల పాటు ఈ సాంగ్ షూటింగ్ ఉంటుంది. టోటల్ సినిమాకే ఈ టైటిల్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణ అంటున్నాడు దర్శకుడు బాబి. గబ్బర్ సింగ్ సినిమాలో […]

టైటిల్ సాంగ్ షూటింగ్ లో సర్దార్
X
సినిమా స్టార్టింగ్ లో వచ్చే టైటిల్ సాంగ్ ను… షూటింగ్ ఆఖర్లో ప్లాన్ చేశాడు పవన్ కల్యాణ్. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు సంబంధించి టైటిల్ సాంగ్ షూటింగ్ ను ఎట్టకేలకు మొదలుపెట్టాడు. హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో ఈ టైటిల్ సాంగ్ షూటింగ్ ప్రారంభమైంది. వారం రోజుల పాటు ఈ సాంగ్ షూటింగ్ ఉంటుంది. టోటల్ సినిమాకే ఈ టైటిల్ సాంగ్ ప్రత్యేక ఆకర్షణ అంటున్నాడు దర్శకుడు బాబి.
గబ్బర్ సింగ్ సినిమాలో టైటిల్ సాంగ్ ఎంత పాపులర్ అయిందో… సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో కూడా టైటిల్ సాంగ్ అంతే హిట్టవుతుందని బల్లగుద్ది మరీ చెబుతున్నాడు. ఈ పాట కోసం దేవిశ్రీప్రసాద్ ఏకంగా 5 కంపోజిషన్లు చేసి ఇస్తే… పవన్ వాటిలోంచి ఒక దాన్ని సెలక్ట్ చేశాడట. అందుకే షూటింగ్ ఆఖర్లో పెట్టుకున్నాడు. ఈ పాట షూటింగ్ అయిన వెంటనే… వచ్చేనెల రెండో వారంలో ఆడియో ఫంక్షన్ సెలబ్రేట్ చేసి… ఆ తర్వాత యూరోప్ షెడ్యూల్ పెట్టుకోవాలని పవన్ భావిస్తున్నాడు. ఏప్రిల్ 8న సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా థియేటర్లలోకి రాబోతోంది.
First Published:  24 Feb 2016 8:53 PM GMT
Next Story