ఆ టీవీ చానల్‌పై గౌర‌వం ఉంది .. దాన్ని నిలుపుకోవాలి – వైసీపీ ఎమ్మెల్యే

తాను పార్టీ మారుతున్న‌ట్టు ప‌దేప‌దే కొన్ని టీవీ చాన‌ళ్లు ప్ర‌సారం చేయ‌డంపై మైదుకూరు వైసీపీ ఎమ్మెల్యే తీవ్రంగా స్పందించారు. తాను ఎప్ప‌టికీ జ‌గ‌న్ వెంటే ఉంటాన‌న్నారు. పార్టీ మార‌డం లాంటి అనైతిక చ‌ర్య‌ల‌కు పాల్ప‌డే వ్య‌క్తిని తాను కాద‌న్నారు. కానీ త‌న‌తో పాటు మిగిలిన ఎమ్మెల్యేల‌పై ఇష్టానుసారం క‌థ‌నాలు ప్ర‌సారం చేయ‌డం మానుకోవాల‌ని కోరారు.

టీవీ9 ప‌దేప‌దే త‌న‌పై ఇలాంటి క‌థ‌నం ప్ర‌సారం చేయ‌డాన్ని ర‌ఘురామిరెడ్డి త‌ప్పుప‌ట్టారు. టీవీ9 అంటే త‌న‌కు గౌర‌వం ఉంద‌ని ఇలాంటి అవాస్త‌వాలు ప్ర‌సారం చేయ‌డం మానుకోవాల‌ని కోరారు. పార్టీ మార‌డం లేద‌ని చెప్పిన త‌ర్వాత కూడా ఎలా ప్ర‌సారం చేస్తార‌ని మండిప‌డ్డారు. తెలంగాణలో పార్టీ మారితే వ్యతిరేకించి ఇక్క‌డ మాత్రం ఎలా సమర్థిస్తారని ప్ర‌శ్నించారు. చంద్రబాబుకు నైతిక విలువలు ఉన్నాయా అని ప్ర‌శ్నించారు. విలువ‌లులేని చంద్ర‌బాబు విలువల గురించి మాట్లాడ‌డం హాస్యాస్ప‌దంగా ఉంద‌న్నారు. క‌డ‌ప జిల్లాలో ప‌ర్య‌టిస్తున్న జ‌గ‌న్‌ను ఎమ్మెల్యే ర‌ఘురామిరెడ్డి క‌లిశారు. ఆయ‌న‌తో పాటు క‌డ‌ప ఎమ్మెల్యే అజంబాషా కూడా స‌మావేశ‌మ‌య్యారు.

Click on image to read:  

MP-Shiva-Prasad

chandrababu-naidu-chaild-1

jagan-harikrishna

jagan-chandrababu-naidu

trs-congress-tdp-bjp1

jagan111

mudragada-chandrababu

bhuma-shilpa-family-tdp

bhuma-nagireddy

chandrababu-it1

lokesh-roja

balakrishna-chiru

raghuveera-balakrishna

jagan-jc-in-delhi

chintamaneni

kodali-nani

chandrababu-naidu