Telugu Global
Cinema & Entertainment

కొరటాలకు గిఫ్టుల మీద గిఫ్టులు

సినిమా హిట్టయినా అవ్వకపోయినా…. దర్శకుడికి అతనుచెప్పిన పారితోషికం ముడుతుంది. అదే హిట్టయితే మాత్రం కొన్ని సందర్భాల్లో అదనపు ప్రయోజనాలు ఉంటాయి. తన ప్రతి సినిమాకు ఇలాంటి అదనపు ప్రయోజనాన్ని పొందుతూనే ఉన్నాడు దర్శకుడు కొరటాల శివ. ఇప్పటివరకు 2 సినిమాలు మాత్రమే చేసిన కొరటాల… ఈ రెండు సినిమాలకు సంబంధించి ఖరీదైన బహుమతులు అందుకున్నాడు. ఇక త్వరలోనే పట్టాలపైకి రాబోతున్న మూడో సినిమాకు సంబంధించి కూడా కాస్ట్ లీ గిఫ్ట్ అందుకున్నాడు. ప్రభాస్ తో కలిసి తొలి […]

కొరటాలకు గిఫ్టుల మీద గిఫ్టులు
X
సినిమా హిట్టయినా అవ్వకపోయినా…. దర్శకుడికి అతనుచెప్పిన పారితోషికం ముడుతుంది. అదే హిట్టయితే మాత్రం కొన్ని సందర్భాల్లో అదనపు ప్రయోజనాలు ఉంటాయి. తన ప్రతి సినిమాకు ఇలాంటి అదనపు ప్రయోజనాన్ని పొందుతూనే ఉన్నాడు దర్శకుడు కొరటాల శివ. ఇప్పటివరకు 2 సినిమాలు మాత్రమే చేసిన కొరటాల… ఈ రెండు సినిమాలకు సంబంధించి ఖరీదైన బహుమతులు అందుకున్నాడు.
ఇక త్వరలోనే పట్టాలపైకి రాబోతున్న మూడో సినిమాకు సంబంధించి కూడా కాస్ట్ లీ గిఫ్ట్ అందుకున్నాడు. ప్రభాస్ తో కలిసి తొలి ప్రయత్నంగా మిర్చి సినిమా చేశాడు. ఆ మూవీ ఊహించని విధంగా విజయం సాధించడంతో… ప్రభాస్ తో పాటు నిర్మాతలంతా కలిసి కొరటాలకు ఖరీదైన బహుమతి ఇచ్చారు. తర్వాత శ్రీమంతుడు కూడా హిట్టవ్వడంతో… మహేష్ పిలిచిమరీ శివకు కాస్ట్ లీ కారు బహుమతిగా ఇచ్చాడు.
ఇప్పుడు ఎన్టీఆర్ కూడా అదే దారిలో నడిచాడు. త్వరలోనే సెట్స్ పైకి రాబోతున్న జనతా గ్యారేజీ సినిమాకు సంబంధించి…. షూటింగ్ ప్రారంభం కాకుండానే కొరటాలకు బహుమతి అందించాడు. దాదాపు 20లక్షల ఖరీదు చేసే వాచీని కొరటాలకు గిఫ్ట్ గా ఇచ్చాడట ఎన్టీఆర్.
First Published:  25 Feb 2016 10:15 PM GMT
Next Story