చివరి క్షణంలో ఊపిరి ఆగిపోయింది

నాగార్జున-కార్తి హీరోలుగా నటించిన మల్టీస్టారర్ సినిమా ఊపిరి. పీవీపీ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. గోపీసుందర్ సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని పాటల్ని ఈనెల 28న విడుదల చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు ఆఖరి నిమిషంలో ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. అంతా అనుకుంటున్నట్టు…. ఈ ఆదివారం ఆడియో ఫంక్షన్ నిర్వహించకుండా…. దాన్ని మార్చి 1కు వాయిదావేశారు. ఈ మంగళవారం హైదరాబాద్ లోని హైటెక్స్ లో ఊపిరి పాటల్ని విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే ఆడియో ఫంక్షన్ ను ఉన్నఫలంగా వాయిదా వేయడానికి కారణాలు మాత్రం తెలియరాలేదు. తెలుగు-తమిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయాలనుకుంటున్న ఊపిరి సినిమాకు సంబంధించి ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఓ కొలిక్కి రాకపోవడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. మార్చిలో ఈ సినిమాను ఒకేసారి తెలుగు-తమిళ భాషల్లో విడుదల చేయబోతున్నారు.
Click on Image to Read:
aishwarya
bahubali
lavanya-tripati