Telugu Global
Cinema & Entertainment

శాటర్న్ అవార్డుకు ఎంపికైన బాహుబలి

రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా మరో రికార్డు సృష్టించింది. ప్రతిష్టాత్మక శాటర్న్ అవార్డ్స్-2016కు ఎంపికైంది. ది అకాడమీ ఆఫ్ సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ అండ్ హారర్ ఫిలిమ్స్ అని వ్యవహరించే శాటర్న్ అవార్డ్స్ కు బాహుబలి నామినేట్ అయింది. మొత్తం 5 విభాగాల్లో ఈ సినిమా నామినేట్ అయింది. ఉత్తమ ఫాంటసీ చిత్రం విభాగంతో పాటు సంగీతం, కళావిభాగం, సహాయ నటి, కాస్ట్యూమ్ డిజైన్ విభాగాల్లో ఈ సినిమా నామినేట్ అయింది. ఈ ఐదు విభాగాల్లో ఏ […]

శాటర్న్ అవార్డుకు ఎంపికైన బాహుబలి
X
రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమా మరో రికార్డు సృష్టించింది. ప్రతిష్టాత్మక శాటర్న్ అవార్డ్స్-2016కు ఎంపికైంది. ది అకాడమీ ఆఫ్ సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ అండ్ హారర్ ఫిలిమ్స్ అని వ్యవహరించే శాటర్న్ అవార్డ్స్ కు బాహుబలి నామినేట్ అయింది. మొత్తం 5 విభాగాల్లో ఈ సినిమా నామినేట్ అయింది. ఉత్తమ ఫాంటసీ చిత్రం విభాగంతో పాటు సంగీతం, కళావిభాగం, సహాయ నటి, కాస్ట్యూమ్ డిజైన్ విభాగాల్లో ఈ సినిమా నామినేట్ అయింది. ఈ ఐదు విభాగాల్లో ఏ ఒక్క విభాగంలో బాహుబలికి అవార్డు దక్కినా అది చరిత్ర సృష్టించినట్టే అవుతుంది. ఎందుకంటే… ఇప్పటివరకు ఏ భారతీయ చిత్రానికి శాటర్న్ అవార్డు రాలేదు.
ఇప్పుడు ఏకంగా బాహుబలి 5 విభాగాల్లో నామినేషన్లు పొందింది. బాహుబలితో పాటు జురాసిక్ వరల్డ్, మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ, ఎవెంజర్స్-ఏజ్ ఆఫ్ అల్ట్రాన్, స్టార్ వార్స్-దిఫోర్స్ ఎవేకెన్స్ చిత్రాలు రేసులో నిలిచాయి. మరి ఈ భారీ హాలీవుడ్ చిత్రాల్ని దాటుకొని బాహుబలి అవార్డు దక్కించుకుంటుందా అనేది వేచి చూడాలి.
Click on Image to Read:
aishwarya
oopiri-movie
lavanya-tripati
First Published:  26 Feb 2016 8:51 PM GMT
Next Story