Telugu Global
Cinema & Entertainment

హాస్య‌న‌టి బండ‌జ్యోతి మృతి!

హాస్య‌న‌టిగా ప‌లు సినిమాల్లో న‌టించి గుర్తింపు తెచ్చుకున్న బండ‌జ్యోతి గుండెపోటుతో మ‌ర‌ణించారు. హైద‌రాబాద్ చిత్ర‌పురికాల‌నీలో ఆమె ఇంట్లోనే మృతి చెందారు. కొంత‌కాలంగా ఆమె అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న‌ద‌ని, అయితే నిదానంగా కోలుకుంటున్న స‌మ‌యంలో హ‌ఠాత్తుగా గుండెపోటు వ‌చ్చింద‌ని ఆమె కుటుంబ స‌భ్యులు తెలిపారు. అహ‌నా పెళ్లంట‌, విజ‌య రామ‌రాజు, తోక‌లేని పిట్ట‌, భ‌ద్రాచ‌లం, గ‌ణేశ్‌, ఊర్మిళా డైరీ, క‌ల్యాణ రాముడు, స్వ‌యం కృషి, కాస్కో, యుగ‌ళ‌గీతం, క్షేమంగా వెళ్లి లాభంగా రండి… త‌దిత‌ర చిత్రాల్లో ఆమె హాస్య‌, స‌హాయ పాత్ర‌ల్లో […]

హాస్య‌న‌టి బండ‌జ్యోతి మృతి!
X

హాస్య‌న‌టిగా ప‌లు సినిమాల్లో న‌టించి గుర్తింపు తెచ్చుకున్న బండ‌జ్యోతి గుండెపోటుతో మ‌ర‌ణించారు. హైద‌రాబాద్ చిత్ర‌పురికాల‌నీలో ఆమె ఇంట్లోనే మృతి చెందారు. కొంత‌కాలంగా ఆమె అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న‌ద‌ని, అయితే నిదానంగా కోలుకుంటున్న స‌మ‌యంలో హ‌ఠాత్తుగా గుండెపోటు వ‌చ్చింద‌ని ఆమె కుటుంబ స‌భ్యులు తెలిపారు. అహ‌నా పెళ్లంట‌, విజ‌య రామ‌రాజు, తోక‌లేని పిట్ట‌, భ‌ద్రాచ‌లం, గ‌ణేశ్‌, ఊర్మిళా డైరీ, క‌ల్యాణ రాముడు, స్వ‌యం కృషి, కాస్కో, యుగ‌ళ‌గీతం, క్షేమంగా వెళ్లి లాభంగా రండి… త‌దిత‌ర చిత్రాల్లో ఆమె హాస్య‌, స‌హాయ పాత్ర‌ల్లో క‌నిపించారు. న‌టించిన కొన్ని పాత్ర‌ల్లో అయినా ఆమె త‌న‌దైన గుర్తింపు పొంద‌గ‌లిగారు. త‌న‌ను సినీ ప‌రిశ్ర‌మ‌ సులువుగా గుర్తు ప‌ట్టాల‌నే, త‌న పేరుకి ముందు బండ అని పెట్టుకున్న‌ట్టుగా గ‌తంలో ఆమె ఒక ఇంట‌ర్వ్యూలో చెప్పారు. ఆమె మృతిప‌ట్ల సినీరంగంలో తీవ్ర దిగ్భ్రాంతి వ్య‌క్త‌మ‌వుతోంది.

First Published:  26 Feb 2016 10:08 PM GMT
Next Story