Telugu Global
NEWS

జగన్ పై రాహుల్ కు సదాభిప్రాయం లేదట!

విజయవాడలో జరిగిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.  మొన్నీ మధ్య  పార్లమెంట్ ప్రాంగణంలో జగన్‌తో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చిన జేసీ … ఈ విషయంపై చంద్రబాబు ఏమనుకుంటారని భావించారో ఏమో గానీ వివరణ ఇచ్చారు.  అంతేకాదు చంద్రబాబు మనసు గెలిచేలా వ్యాఖ్యలు చేశారు. జగన్‌కు హాయ్ చెప్పి ఫొటోలు మాత్రమే దిగానని.. రాజకీయ చర్చలేమీ జరగలేదన్నారు. వైసీపీ నుంచి చాలా మంది […]

జగన్ పై రాహుల్ కు సదాభిప్రాయం లేదట!
X

విజయవాడలో జరిగిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మొన్నీ మధ్య పార్లమెంట్ ప్రాంగణంలో జగన్‌తో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చిన జేసీ … ఈ విషయంపై చంద్రబాబు ఏమనుకుంటారని భావించారో ఏమో గానీ వివరణ ఇచ్చారు. అంతేకాదు చంద్రబాబు మనసు గెలిచేలా వ్యాఖ్యలు చేశారు.

జగన్‌కు హాయ్ చెప్పి ఫొటోలు మాత్రమే దిగానని.. రాజకీయ చర్చలేమీ జరగలేదన్నారు. వైసీపీ నుంచి చాలా మంది ఎమ్మెల్యేలు టీడీపీకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. అయితే జగన్ ను కలిసిన రోజే పార్లమెంట్ ఇన్నర్ లాబీల్లో సోనియాను కలిశానని చెప్పారు. రాష్ట్రాన్ని విభజించినందుకు ఆమెలో కాసింతైన పశ్చాత్తాపం కనిపించలేదన్నారు. విభజన వల్ల పార్టీతో పాటు రాష్ట్రం, తాము అందరం ముగినిపోయామని సోనియాకు చెప్పారట జేసీ. అసలు ఏపీలో కాంగ్రెస్‌కు మనుగడే లేదని సోనియాతో చెప్పానని మీడియాతో అన్నారు. అంతేకాదు సోనియాను కలిసిన ఐదు నిమిషాలకే రాహుల్ గాంధీ కూడా జేసీని కలిశారట. రాహుల్‌లో మాత్రం విభజన విషయంలో తప్పుచేశామన్న భావన కనిపించిందన్నారు. జగన్‌పైన రాహుల్‌కు సదాభిప్రాయం లేదని చెప్పారు.

అయితే జేసీ మాటలపై కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సోనియాను కలవడం వరకు బాగానే ఉంది. నేరుగా ఆమెతోనే కాంగ్రెస్‌కు మనుగడ లేదని చెప్పేంత సీన్‌ జేసీకి ఉందా అని అంటున్నారు. సోనియాను కలవాలంటే పెద్దపెద్ద లీడర్లే చాలా శ్రమపడాల్సి ఉంటుంది. అలాంటి జేసీ నేరుగా వెళ్లి సోనియాతో చర్చలు జరిపారంటే నమ్మవచ్చా? అని ప్రశ్నిస్తున్నారు. మరో ఐదు నిమిషాల్లోనే రాహుల్‌ కలవడం … జగన్‌ గురించి చెప్పడం కూడా జరిగిపోయిందని జేసీ చెబుతున్నారు. అసలు వీరు ఇద్దరు కలిస్తే జగన్‌ ప్రస్తావన ఎందుకొచ్చిందన్నది మాత్రం జేసీ చెప్పలేదు. మొత్తం మీద జేసీ చెప్పినట్టు నిజంగా ఐదు నిమిషాల వ్యవధిలోనే సోనియా, రాహుల్‌తో మాట్లాడే అవకాశం జేసీకి దొరికి ఉంటే గొప్ప విషయమే. ఏపీలో అసలు కాంగ్రెస్‌కు మనుగడే లేదని నేరుగా సోనియాతోనే చెప్పి ఉంటే జేసీ చాలా ధైర్యవంతుడే.

Click on image to read:

devid-raj

bhuma-akhila-priya

bhuma

jagan-akhilpriya

roja-gali

adhinarayana-reddy

316d158c-2a72-4e93-80b9-bbb41a88eb42

roja-anam

pawan

revanth

CM-KCR-Worry-About-His-Ging

cbn-doctorate

ysrcp

veni-krishna

balakrishna-speech

vote-for-note-1

First Published:  28 Feb 2016 5:24 AM GMT
Next Story